Weight Lose Drinks: బరువు తగ్గడం అనేది కేవలం ఆహారం తగ్గించడం లేదా వ్యాయామం చేయడం వల్ల మాత్రమే జరగదు. మనం తీసుకునే డ్రింక్స్ కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. కృత్రిమ చక్కెరలు, అధిక క్యాలరీలు ఉండే డ్రింక్స్‌కు బదులుగా.. ఇంట్లోనే సహజసిద్దంగా తయారు చేసుకునే కొన్ని డ్రింక్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. శరీరాన్ని కూడా డీటాక్సిఫై చేసే ఈ డ్రింక్సం కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. మరి ఎలాంటి డ్రింక్స్ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు ? వాటిని ఎలా తయారు చేసుకోవాలనే విషయాలనుు గురించిన పూర్తి వివరాలను ఇప్పుుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి సహాయపడే డ్రింక్స్:
నిమ్మకాయ, తేనె కలిపిన గోరు వెచ్చని నీరు:
ఇది బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన, ప్రభావ వంతమైన డ్రింక్స్‌లో ఒకటి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం, ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా తరచుగా తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు.
ప్రయోజనం: నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. తేనె జీవ క్రియను కూడా పెంచుతుంది.
జీలకర్ర నీరు :
ఒక టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని మరిగించి వడకట్టి తాగాలి.
ప్రయోజనం: జీలకర్రలో జీవక్రియను వేగవంతం చేసే గుణాలున్నాయి. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి, అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయ పడుతుంది. ఉబ్బరం, అజీర్తిని కూడా తగ్గిస్తుంది.
సోంపు నీరు :
ఒక టీస్పూన్ సోంపును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి.. ఉదయం ఆ నీటిని వడ కట్టి తాగాలి.
ప్రయోజనం: సోంపులో మూత్ర విసర్జనను ప్రోత్సహించే గుణాలున్నాయి, ఇవి శరీరం నుంచి అదనపు నీటిని అంతే కాకుండా విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఆకలిని కూడా నియంత్రిస్తుంది.
Also Read: ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్ ఏంటంటే ?
అల్లం టీ :
కొన్ని అల్లం ముక్కలను నీటిలో వేసి మరిగించి, వడకట్టి తాగాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కూడా ఇందులో కలుపుకోవచ్చు.
ప్రయోజనం: అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగించి.. అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఆపుతుంది. అంతే కాకుండా ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కూడా కలిగిస్తుంది.
గ్రీన్ టీ :
రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ప్రయోజనం: గ్రీన్ టీలో కేటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కొవ్వును తగ్గించడంలో సహాయ పడతాయి. అంతే కాకుండా జీవ క్రియను కూడా పెంచుతాయి. ఇందులో తక్కువ మొత్తంలో కెఫిన్ కూడా ఉంటుంది.