Airplane Mode: టెక్ యుగంలో ఎవరి చేతులు చూసినా స్మార్ట్ ఫోన్‌లు కనిపిస్తాయి. వారి వారి స్థాయిల నుంచి రకరకాల కంపెనీ ఫోన్లు వాడుతుంటారు. స్మార్ట్‌ఫోన్ కొన్ని టెక్నాలజీతో వస్తున్నాయి. కేవలం ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ల్లో కాకుండా చౌకైన వాటిలో కొన్ని ఫీచర్లు ఉంటున్నాయి.
ముఖ్యంగా ఎయిర్ ప్లేన్ మోడ్ చెప్పుకుందాం. ఆ ఆప్షన్ కేవలం విమాన ప్రయాణ సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. పెద్ద పనులను సులభతరం చేస్తుంది. ఈ మోడ్ నెట్‌వర్క్.. Wi-Fi, బ్లూటూత్, వైర్‌లెస్ కనెక్షన్‌లను తాత్కాలికంగా ఆపివేస్తుంది.
దీనివల్ల బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడమే కాదు. అనేక ప్రయోజనాలు లేకపోలేదు. ఎయిర్‌ప్లేన్ మోడ్ 5 ఉపయోగాలపై మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటి గురించి నేటికి 100 మందిలో 80 మందికి అస్సలు తెలీయదంటే తెలీదు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.
ఎయిర్ ప్లేన్ మోడ్ చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతుంటే మీకు చాలా సహాయపడుతుంది. వేగంగా ఛార్జ్ కావాలనుకుంటే ఆ సమయంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల వెనుక నుంచి నడుస్తున్న నెట్‌వర్క్ కార్యకలాపాలు పూర్తిగా ఆగుతాయి. అంతేకాదు ఫోన్ ఛార్జింగ్ వేగంగా అవుతుంది.
ALSO READ: ఏఐపై విజయం సాధించిన మానవుడు.. కోడింగ్ పోటీల్లో కృత్రిమ మేధస్సుని ఎలా ఓడించాడంటే
నెట్‌వర్క్ బలహీనంగా ఉన్న ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ కోసం అనుక్షణం వెతుకుతుంటారు. దీనివల్ల బ్యాటరీ వేగంగా అయిపోతుంది. అలాంటి పరిస్థితిలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా బ్యాటరీ ఆదా చేయవచ్చు.
ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్న సమయం, చదువుపై దృష్టి పెట్టలేకపోతే ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. కొన్నిసార్లు నోటిఫికేషన్‌లు మీ దృష్టిని మరల్చుతాయి. ఆ సమయంలో ఎయిర్‌ప్లేన్ మోడ్ చాలా సహాయపడుతుంది. దీన్ని ఆన్ చేసిన తర్వాత మీకు ఎటువంటి కాల్స్ రాదు. ఏ సందేశం మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు.
పిల్లలు ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంటర్నెట్‌కు దూరంగా ఉండాలని మీరు కోరుతారు. ఫోన్ ఇచ్చే ముందు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయవచ్చు. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఇంటర్నెట్ ఆఫ్‌లో ఉంటే ప్రకటనలు తక్కువగా కనిపిస్తాయి.
కొన్నిసార్లు సిగ్నల్ సరిగా లేకపోవడం లేదా భారీ పనుల కారణంగా ఫోన్ వేడెక్కుతుంది. అలాంటి పరిస్థితిలో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ప్రాసెసర్‌పై లోడ్‌ను తగ్గించవచ్చు. ఆ తర్వాత వేడెక్కడం తగ్గుతుంది.