New GST Effect Movie Tickets: కరోనా తర్వాత వస్తు సేవల పన్ను(GST) భారీగా పెరగిన సంగతి తెలిసిందే. దీంతో నిత్యావసర సరుకులు నుంచి ఇతర నిత్యావసర వస్తువలు సామాన్యుడికి అందుబాటులోకి లేకుండ పోయాయి. చివరికి సినిమా టికెట్లు కూడా సామాన్యుడి జేబులు ఖాళీ అయ్యే పరిస్థితులు వచ్చాయి. టికెట్ ధరలన్ని ఒకేలా ఉండటంతో మల్టీప్లెక్స్కు ఆదరణ పెరిగి.. సింగిల్ స్క్రీన్లకు ఆదరణ తగ్గింది. అయితే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అనేక వస్తువులపై ఉన్న పన్ను స్లాబ్లను సవరించి ప్రకటించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సితారామన్ తాజాగా కొత్త స్లాబ్లను ప్రకటించారు.
ఇందులో సినిమా టికెట్స్ ఉండటంతో టికెట్స్ రేట్స్ భారీగా తగ్గాయి. రూ. 100 వరకు ఉన్న టికెట్ రేట్లపై 5% తగ్గించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు, చిన్న పట్టణాల్లోని సినిమా హాళ్లకు నేరుగా ప్రయోజం చేకూర్చే దిశగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రూ. 100 కంటే ఎక్కువ ఉంటే మాత్రం అది 18 శాతం జీఎస్టీ వసూలు కొనసాగుతుంది. ఈ తగ్గింపు వల్ల సింగిల్ స్క్రీన్లకు ప్రయోజం చేకూరేల ఉంది. కానీ, మల్టిప్లెక్స్, ప్రీమియం థియేటర్లపై ఈ కొత్త జీఎస్టీతో ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం అవుతోంది. ఇక మల్టీప్లెక్స్లో సినిమా అంటే అందరికి వెంటనే గుర్తోచ్చేది పాప్ కార్న్.
పాప్ కార్న్ లేకుండ సినిమాని ఆస్వాధించలేము. కానీ, దీని ధర చూస్తే మాత్రం ఆకాశాన్ని తాకేది. దీంతో మల్టీప్లెక్స్ పాప్ కార్న్ కొనాలంటే సామాన్యుడు వణికే పరిస్థితి వచ్చింది. దీంతో తరచూ సోషల్ మీడియాలో పాప్కార్న్పై వాడి వేడిగా చర్చ జరిగేది. అయితే ఈ కొత్త జీఎస్టీ అమలుతో పాప్కార్న్ ప్రియులకు కాస్తా ఊరట వచ్చింది. సాల్ట్ పాప్కార్న్ 5 శాతం స్లాబ్లోకి.. క్యారమిల్ పాప్ కార్న్ 18 శాతంలో వస్తుంది. గతంలో ఒకే పాప్కార్న్పై ప్యాకేజింగ్ను బట్టి వేరే వేరు పన్ను విధించే వారు. ఇప్పుడు తాజా సవరణతో దానితో సంబంధం లేదు. మల్టీప్లెక్స్లు ఫ్యాక్ చేసి అమ్ముతాయా? విడిగా విక్రయిస్తాయా అన్నది సంబంధం లేకుండ ఈ కొత్త జీఎస్టీ అమలు కానుంది. ప్యాకేజ్డ్ అయినా, విడిగా అమ్మిన సాల్ట్ పాప్కార్న్ ఇకపై 5 శాతం జీఎస్టీలోకి వస్తుంది. ఇక క్యారమెల్ పాప్కార్న్ కూడా అదే వర్తిస్తుంది.
మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ప్రభుత్వాన్ని రూ. 300 వరకు ఉన్న సినిమా టికెట్స్ని 5 శాతం స్లాబ్ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్తించింది. దీనివల్ల సినిమా ప్రదర్శనలు సామాన్యులకు అందుబాటులో ఉండటమే కాకుండా.. కరోనా తర్వాత నునంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న సినిమాల ప్రదర్శనలకు సాయంగా నిలుస్తుందని మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుత జీఎస్టీ చట్టంలో రూ. 100 కు మించి సినిమా టికెట్లను 18 శాతం స్లాబ్ పరిధిలో ఉంచగా..రూ. 100 లోపు టికెట్లపై 12 శాతం జీఎస్టీ అమలవుతోంది. అయితే ఈ తాజా సవరణలో రూ. 100 లోపు టికెట్ రేట్స్ 5 శాతం జీఎస్టీ స్లాబ్లోకి వచ్చాయి.