Telugu film industry: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సినిమా కార్మికులు వారి వేతనాలను 30 శాతం వరకు పెంచాలి అని గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి నిర్మాతలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వీటి గురించి విపరీతంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు వంటి ప్రముఖులను కూడా కొంతమంది నిర్మాతలు కలిశారు.
అయితే ఈ వివాదం ఇప్పటివరకు కూడా ఒక కొలిక్కి రాలేదు. చాలావరకు హైదరాబాదులో జరగాల్సిన షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఇక సోమవారం నుంచి షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది తేల్చే వరకు షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు అని సినిమా కార్మికులు అంటున్నారు. మరోవైపు ఈ ఇష్యూ ని క్లియర్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది.
ఫెడరేషన్ తో నిర్మాతల మీటింగ్స్
ఫెడరేషన్ తో నిర్మాతల మీటింగ్స్ జరుగుతున్నాయి. 9to9 కాల్షీట్ అడుగుతున్నారు నిర్మాతలు , ఫెడరేషన్ ఒప్పుకోవడం లేదట. అలాగే 15 % Hike కి నిర్మాతలు ok అన్నట్టుగా ఉన్నా ఫెడరేషన్ వెనక్కి తగ్గడం లేదట. అంత కన్నా ఎక్కువ అయితే కష్టమని చిన్న నిర్మాతలు ఒప్పుకోవడం లేదట. ఇంకో రెండు రోజుల్లో ఇష్యూ క్లియర్ అవ్వొచ్చు అంటున్నారు. Mostly సోమవారం నుంచి షూటింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా వార్ చర్చల్లోకి ప్రభుత్వం ప్రభుత్వం కూడా ఎంట్రీ ఇచ్చింది. కోమటిరెడ్డి నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
బన్నీ వాసు స్పందన
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో ఒకరు బన్నీ వాసు ఒకరు. గీత ఆర్ట్స్ పైన బన్నీ వాసు సినిమాల నిర్మిస్తూ ఉంటారు. నిర్మాతను తనకంటూ కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమాను బన్నీ వాసు ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ నేడు నిర్వహించారు. ఈవెంట్ లో బన్నీ వాస్ కూడా ఈ విషయం పైన స్పందించారు. రెండు వర్గాల్లో మీరు ఎటువైపు ఉన్నారు అని అడిగినప్పుడు. నేను రెండు వైపులా కూడా ఉన్నాను అంటూ తెలిపారు. బన్నీ వాసు మాట్లాడుతూ నేను న్యూటరల్ గా ఉన్నాను ఎందుకంటే.. వేతనాలు పెంచి 3 ఏళ్లు అయ్యింది. అలాగే.. వాళ్లు కూడా మరీ ఎక్కువ పర్సంటేజ్ అడుగుతున్నారు.
Also Read: Coolie : క్లైమాక్స్ కాదు, ఇంట్రడక్షన్ కాదు… హైలైట్ సీన్ ఇదే.. రివీల్ చేసిన లోకి