BigTV English

Hansika Motwani: విడాకుల రూమర్లపై మౌనం వీడిన హన్సిక… ఎన్నో పాఠాలు నేర్పిందంటూ!

Hansika Motwani: విడాకుల రూమర్లపై మౌనం వీడిన హన్సిక… ఎన్నో పాఠాలు నేర్పిందంటూ!

Hansika Motwani: హన్సిక మోత్వాని (Hansika Motwani) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఇలా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న హన్సిక సోహెల్ కతురియా (Sohale Khaturiya)అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉందనుకునే సమయంలోనే వీరి గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి గత కొంతకాలంగా హన్సిక తన భర్త నుంచి దూరంగా ఒంటరిగా ఉన్నారు. ఈ క్రమంలోనే విడాకుల (Divorce) వార్తలకు బలం చేకూరింది.


హన్సిక.. సోహెల్ విడాకులు?

హన్సిక తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోతున్నారని అందుకే భర్తకు దూరంగా ఉంటున్నారంటూ వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలపై సోహెల్ కతూరియా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని ఆ వార్తలను ఖండించారు. ఇలా తాము విడిపోలేదంటూ సోహెల్ చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పాలి. ఇప్పటికే హన్సిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో డిలీట్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నామని చెప్పకనే చెప్పేశారు.


అడగకుండానే పాఠాలు నేర్పింది..

ఇకపోతే తాజాగా ఈమె ఆగస్టు 9వ తేదీ తన 34వ పుట్టినరోజు(Birthday) వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఈమె..”ఈ ఏడాది నేను అడగకుండానే నాకు ఎన్నో పాఠాలను నేర్పించింది. నాలో ఎంత బలం ఉందో నాకు తెలియజేసింది. ఈ పుట్టినరోజున మీ అందరూ చెప్పిన శుభాకాంక్షలతో నా హృదయం ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉందని ఒక్కోసారి చిన్న విషయాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చిన్ననాటి స్నేహితుడితో వివాహం…

ఇలా హన్సిక చేసిన ఈ పోస్ట్ సరిగ్గా గమనిస్తే ఈమె విడాకుల గురించే ఈ పోస్ట్ చేశారని స్పష్టమవుతుంది తన భర్త నుంచి విడిపోయిన తర్వాత తాను ఎంతో శక్తిని కూడగట్టుకుని ముందుకు నడుస్తున్నానని నాలో ఇంత ధైర్యం ఉందని ఇప్పుడే తెలిసిందంటూ విడాకుల గురించే ఈ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఇలా పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పోస్ట్ చేయడంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె తన చిన్ననాటి స్నేహితుడు సోహెల్ ను ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వివాహం డాక్యుమెంటరీ రూపంలో కూడా ప్రసారమైన సంగతి తెలిసిందే. ఇక పెళ్లయిన కొద్ది రోజులకే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోవడంతో అభిమానులు షాక్ లో ఉండిపోయారు. ఇక ఈమె సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా కొనసాగిన సంగతి తెలిసిందే. అలాగేఈమెకు పలు వ్యాపారాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: Sreeleela: సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన కిస్సిక్ బ్యూటీ.. అమ్మడి స్పీడ్ మామూలుగా లేదే!

Related News

The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?

Gayatri Gupta: ఆ ప్రొడ్యూసర్ నన్ను రే*ప్ చేశాడు… నటి సంచలన వ్యాఖ్యలు

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

War 2 PreRelease Event: వార్ 2 ప్రీ రిలీజ్ వెంట్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా? యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చుచేసిందే..

Parada Movie: ఓపెన్ ఛాలెంజ్ చేసిన డైరెక్టర్.. అనుపమపై అంత నమ్మకమా?

Big Stories

×