E-Paper
Advertisement

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఫైర్.. త్వరలో నివేదిక!
Advertisement

Mahesh Kumar: పార్టీ నియమ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా తప్పేనని,క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీపీసీసీ అధ్యక్షుడు,ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని,ఈ వ్యవహారంపై ఇప్పటికే అధిష్ఠానం దృష్టి సారించిందని తెలిపారు.గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదిక సిద్ధమవుతోందని,సమయాన్ని బట్టి అధిష్ఠానం తగిన నిర్ణయాలు తీసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్ సందీప్ ఎంతో నిబద్ధత కలిగిన సమర్థవంతుడైన నాయకుడని కొనియాడారు.

కృష్ణా జలాలపై బీఆర్ఎస్‌ది ద్రోహం..

కృష్ణా జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. గత పాలకులు చేసిన తప్పిదాలను,ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు నీతులు చెబుతున్నారని,కేటీఆర్ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.గతంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు 36 శాతం వాటా చాలని కేసీఆర్ అంగీకరించారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 70 శాతం వాటా కోసం పోరాడుతోందని తెలిపారు.

Advertisement

Also read: చంద్రబాబుకు దాసోహం.. నీటి హక్కులు తాకట్టు.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

బనకచర్ల ప్రాజెక్టు పై..

బీఆర్ఎస్ పాలనలో ఏపీ 4,464 టీఎంసీల నీటిని వినియోగించుకుంటే, తెలంగాణకు దక్కింది కేవలం 1,993 టీఎంసీలు మాత్రమేనని గణాంకాలతో వివరించారు.ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలివెళ్లకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖలు రాశామని, తెలంగాణ అభ్యంతరాల వల్లే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఆగిపోయాయని చెప్పారు. రాష్ట్ర నీటి వాటా విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు స్పష్టం చేశారని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

బీఆర్ఎస్-బీజేపీ లోపాయికారీ ఒప్పందం..

Advertisement

డ్యామ్‌లపై కేంద్ర బలగాలు,కేఆర్ఎంబీ నియంత్రణ కేంద్రం చేతిలో ఉన్నప్పటికీ, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే బద్నాం చేసేందుకు బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని మండిపడ్డారు. నెహ్రూ హయాంలో కట్టిన ప్రాజెక్టులు దేవాలయాలుగా నిలిచిపోతే, బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత లోపభూయిష్టంగా నిర్మించబడిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ స్థాయి నిపుణులు సైతం ధృవీకరించారని తెలిపారు.

Also read: వృషకర్మ నుంచి మరో సర్‌ప్రైజ్.. ఈసారి ఎమోషన్స్‌తో టార్గెట్ చేశారుగా !

Tags

Related News

షాకింగ్ న్యూస్.. మండీ బిర్యానీ తిని 9మంది ఆస్పత్రిపాలు

ఏసీబీ వలలో చిక్కిన టోలీ చౌక్ సీఐ.. ఎలా పట్టుకున్నారంటే?

డిసెంబర్ 1 నుంచి వారికి బాధ్యతలు.. మంత్రి సీతక్క ఆదేశాలు జారీ!

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బావోద్వేగం!

చంద్రబాబుకు దాసోహం.. నీటి హక్కులు తాకట్టు.. కాంగ్రెస్‌పై హరీష్ రావు ఫైర్!

వాడు పోతే వీడు అంటూ.. ఛత్రపతి డైలాగ్‌తో హరీష్ రావుపై రెచ్చిపోయిన సీఎం రేవంత్!

‘మేడిగడ్డను కాంగ్రెసోళ్లే పేల్చేశారు.. ప్రాజెక్టు కొట్టుకుపోవాలని రేవంత్ కోరిక’.. కేటీఆర్ తీవ్ర ఆరోపణలు!

Big Stories

Advertisement
×