BigTV English

Elon Musk: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. చెప్పినట్టే చేసిన మస్క్, కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

Elon Musk: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. చెప్పినట్టే చేసిన మస్క్, కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన

Elon Musk: ఎట్టకేలకు అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌‌తో విభేదించిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో రిపబ్లికన్​-డెమొక్రాట్స్ రెండు పార్టీలు ఉన్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ పార్టీని పెట్టారు​.


ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మస్క్. అమెరికాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ట్రంప్ తీసుకొచ్చిన ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’కు ఆమోదం తెలిపితే కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. అలాగే చేశారు ఎలాన్ మస్క్.

మస్క్‌ పెట్టిన పార్టీపై సోషల్ మీడియా వేదికగా ఓటింగ్‌ నిర్వహించారు. దీనికి 80 శాతం మంది అనుకూలంగా ఓటు వేశారు. మీరంతా కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నా రని, అది మీకు లభిస్తుందని రాసుకొచ్చారు. నేటి నుంచి మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడిందని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు మస్క్.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఎలాన్ మస్క్‌కు కొద్దిరోజులుగా వివిధ అంశాలపై విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకున్నారు. ఈ క్రమంలో ఆశ్చర్యకరమైన ప్రకటన వెలువడింది. ఆదేశ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కావడానికి మస్క్ కోట్లు వెచ్చించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఖర్చు తగ్గించేందుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి అధిపతిగా ఉంటూ అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నారు మస్క్.

ALSO READ: వన్ బిగ్ బ్యూటీఫుల్ బిల్ అంటే ఏమిటి?

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కల నెరవేరింది. అధికారంలోకి వచ్చాక ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ చట్టంగా మారింది. ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుకు శుక్రవారం అధ్యక్షుడు సంతకంతో చట్టంగా మారింది.

ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులు, మెడిక్‌ ఎయిడ్, ఆహార కూపన్ల కోతకు ఉద్దేశించిన చట్టమిది. దశాబ్దపాటు 3.3 ట్రిలియన్ల ద్రవ్యలోటును తీర్చనుంది. అదే సమయంలో 1.2 కోట్ల మంది ఆరోగ్య బీమాకు దూరమవుతారని నిపుణుల మాట. ఈ బిల్లు అటు ట్రంప్-ఇటు మస్క్ మధ్య చిచ్చుపెట్టింది. దీనివల్ల ట్రంప్‌కు దెబ్బ తగులుతుందని అక్కడి నేతల మాట. ఇక మస్క్ చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయమని అంటున్నారు.

మస్క్ కొత్త పార్టీ పెట్టడంతో 2026 మధ్యంతర ఎన్నికల కోసం కొన్ని కీలకమైన తీసుకునే అవకాశముంది. హౌస్, సెనేట్ సీట్లపై మస్క్ దృష్టి సారిస్తారని అంటున్నారు. అదే జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో డెమోక్రటిక్- రిపబ్లికన్ రాజకీయ పార్టీలు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మస్క్ తెచ్చిన కొత్త పార్టీ అక్కడి రాజకీయ వ్యవస్థకు సవాలుగా మారుతుందా? అనేది అక్కడి చర్చ.

తొలుత రాష్ట్రాల వారీగా బ్యాలెట్ కోసం వేల సంతకాలను సేకరించాలి. ఆ తర్వాత ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ నుంచి గుర్తింపు పొందాలి. ఈ ప్రక్రియలో లీగల్ సమస్యలు ఎదురవుతాయని, రెండు పార్టీల నుంచి వ్యతిరేకత రావచ్చని అంటున్నారు. మస్క్ భారీగా సంపద కలిగి వుండటం వల్ల కొత్త పార్టీ ఏర్పాటు తేలికే కావచ్చు అంటున్నారు. ఓటర్లను ఒప్పించడం, రాజకీయ నేతగా రాణించడం అనేది మస్క్ కు అతి పెద్ద సవాల్. గతంలో రాస్ పెరోట్ వంటివారు మూడో పార్టీని స్థాపించి బోర్లాపడ్డారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 

Related News

Kartarpur Corridor: పొంగిన రావి నది.. మునిగిన కర్తార్‌పూర్ కారిడార్.. నీటిలో వందలాది మంది

Minneapolis shooting: మినియాపొలిస్‌లో రక్తపాతం.. చర్చి స్కూల్‌పై రైఫిల్ దాడి.. అసలేం జరిగిందంటే?

Trump Statement: భారత్, పాక్ కి నేనే వార్నింగ్ ఇచ్చా.. మరింత గట్టిగా ట్రంప్ సెల్ఫ్ డబ్బా

Trump’s Tariff War: ట్రంప్ టారిఫ్ స్టార్ట్! భారత్‌కు కలిగే నష్టాలు ఇవే..

India Vs America: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?

India-China: సుంకాల యుద్ధం.. చైనాతో భారత్ సయోధ్యకు ప్రయత్నం

Big Stories

×