Hari Hara VeeraMallu: పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జులై 24న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా మీద కొద్దిపాటి నెగిటివ్ ట్రోల్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతున్నట్లు అధికారకంగా పోస్టర్లు కూడా రిలీజ్ చేసి చెబుతున్నారు.
అయితే ఈ సినిమాలో ముఖ్యంగా కంప్లైంట్ ఉన్న విషయం గ్రాఫిక్స్. ఏ సీన్స్ అయితే కంప్లైంట్ ఉన్నాయో వాటిని తొలగించి మళ్లీ అప్డేటెడ్ వెర్షన్ యాడ్ చేశారు కూడా. అయితే ఈలోపే జరగల్సినవన్నీ జరిగిపోయాయి. అయితే ఈ సినిమాను చూడాలని కొంతమంది చిన్నారులు తిరుపతిలో తమ కోరికను వ్యక్తం చేశారు.
చిన్నారుల కోసం స్పెషల్ షో
మొత్తానికి తిరుపతిలో చిన్నారుల కోసం హరిహర వీరమల్లు సినిమా స్పెషల్ షో వేశారు. పవన్ సినిమా చూడాలని నవజీవన్ అంధుల, మూగ, చెవిటి ఆశ్రమ విద్యార్థులు కోరారు. సుమారు 200 మంది మంది దివ్యాంగులకు హరిహర వీరమల్లు సినిమా స్పెషలో షో ఏర్పాటు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్ మరియు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు.
పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెబుతూ.. హరిహర వీరమల్లు సినిమా చూడటం సంతోషంగా ఉందని చిన్నారులు, విద్యార్థులు తెలిపారు.
సినిమా అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలియజేశారు. కిరణ్ రాయల్ మాట్లాడుతూ… చిన్నారులతో కలిసి సినిమా చూసినందుకు ఆనందంగా ఉంది అన్నారు.
చిన్నారులు మాట్లాడుతూ. .. సినిమా చూడలేక పోయిన సినిమాలోని డైలాగులు, పాటలు చాలా బాగా నచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ గారి #HariHaraVeeraMallu చిత్రం చూడాలి అని కొంతమంది దివ్యాంగులు కోరుకున్న వీడియో సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న తిరుపతి జనసేన నాయకులు వారికోసం ప్రత్యేక షో ఏర్పాటు చేశారు.
సినిమా చూసిన అనంతరం ఆ చిన్నారులు వారి ఆనందాన్ని పంచుకున్నారు.
చూడలేకపోయినా సినిమాను విని… pic.twitter.com/TuowE0fPyG— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 29, 2025
ఎన్నో ఇబ్బందులు తర్వాత
ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సినిమాను మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనౌన్స్ చేశారు. అప్పుడు చాలామందికి విపరీతమైన అంచనాలు పెరిగాయి. తర్వాత కొన్ని కారణాల వలన క్రిష్ జాగర్లమూడి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. నిర్మాత ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మొత్తానికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కొంతమేరకు మంచి టాక్ నే సంపాదించుకుంది. ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా పార్ట్ 2 కు సంబంధించి 20% షూట్ కూడా జరిగిపోయింది.
Also Read: Prabhas: ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లోకి అడుగుపెట్టిన పూరి జగన్నాథ్, కారణం ఇదే