OTT Movie : ఎర్రచందనం స్మగ్లింగ్ నిజమైన సంఘటనల ఆధారంగా 2023లో తెరకెక్కిన ఒక తమిళ యాక్షన్ థ్రిల్లర్, ఈ ఏడాది జులై 31 నుండి, అంటే ఈ గురువారం నుంచి తెలుగులో మరో ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రస్తుతం తమిళ భాషలో Aha Tamilలో అందుబాటులో ఉంది. దాదాపు రెండు సంవత్సరాల తరువాత తెలుగులో స్ట్రీమింగ్ కి వస్తోంది. యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిన ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా ‘పుష్ప’ ను గుర్తుకు చేస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి వస్తోంది అనే వివరాల్లోకి వెళితే …
ఈటీవి విన్ లో
‘రెడ్ శాండల్ వుడ్’ (Red sandal wood) 2023లో విడుదలైన తమిళ యాక్షన్ థ్రిల్లర్. ఇది గురు రామానుజం దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో వెట్రి, దియా మయూరి, రామచంద్ర రాజు, ఎం.ఎస్. భాస్కర్, గణేష్ వెంకట్రామన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన నిజమైన ఎర్రచందనం స్మగ్లింగ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఇది 2023 సెప్టెంబర్ 8న థియేటర్లలో విడుదలైంది. 2023 అక్టోబర్ 20 నుండి Aha Tamilలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ETV Win లో 2025 జులై 31 నుండి తెలుగులో స్ట్రీమింగ్ కు రానుంది. 1 గంట 33 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.9/10 రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
ప్రభు (వెట్రి) అనే పోలీస్ ఆఫీసర్ చెన్నై నుండి ఆంధ్రప్రదేశ్ కి వస్తాడు. అతను తన స్నేహితురాలి (దియా మయూరి) సోదరుడు కరుణను వెతకడానికి ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటకు వెళతాడు. కరుణ మిస్సింగ్ నేపథ్యంలో, ప్రభు అతన్ని వెతుకుతూ ఒక భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ రాకెట్‌ను కనుగొంటాడు. ఈ స్మగ్లింగ్ రాకెట్‌ను రామ్ (రామచంద్ర రాజు) అనే క్రూరమైన స్మగ్లర్ నడుపుతుంటాడు. అతను పేద ప్రజలను, ధనవంతులుగా మారుస్తానని వాగ్దానం చేస్తాడు. కానీ ఆ కూలీల పరిస్థితి మరోలా ఉంటుంది. ప్రభు తన స్నేహితురాలి సోదరుడిని కనిపెట్టి, ఈ స్మగ్లింగ్ రాకెట్‌ను బయటపెట్టాలని నిర్ణయించుకుంటాడు.
Read Also : బెడ్ పై నరకం చూపించే భర్త… కొట్టి మరీ పని కానిచ్చే సైకో… ఆమె ఇచ్చే ట్విస్ట్ కు దిమాక్ కరాబ్