OTT Movies: మీకు టీనేజ్ లవ్ స్టోరీస్ ఇష్టమా? అయితే, తప్పకుండా ‘వియ్ ఆర్ లయర్స్’ (We Are Liars) వెబ్ సీరిస్ చూసేయండి. రొమాన్స్.. స్పస్పెన్స్.. థ్రిల్‌తో కూడిన ట్విస్టులతో సాగిపోయే ఈ వెబ్ సీరిస్ మిమ్మల్ని టీవీ ముందు నుంచి లేవనివ్వద్దు. మళ్లీ చెప్పలేదు అనుకోవద్దు. ఇందులో పెద్దల సీన్లు కూడా ఉంటాయి. ఇక కథలోకి వెళ్తే..
సిన్‌క్లెయిర్ అనే ఓ సంపన్న కుటుంబం వేసవి విడిది కోసం బీచ్‌వుడ్ దీవికి వస్తుంది. కాడెన్స్ (మమీ బ్లాక్‌వుడ్), ఆమె బంధువులు మిర్రెన్ (జూలీ రిచర్డ్‌సన్), జానీ (జాక్ డైలాన్ గ్రేజర్)లకు గాట్ (కెనీస్ లియూ) అనే ఇండియన్ అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. వారంతా బాల్యం నుంచే మించి స్నేహితులు. ప్రతి సమ్మర్ వెకేషన్‌కు వారంతా ఆ దీవిలో కలుసుకుంటారు. ఈ నలుగురిని ఆ కుటుంబం ‘లయర్స్’ అని పిలుస్తారు.
కాడెన్స్‌కు బాల్యం నుంచి గాట్ అంటే ఇష్టం. అయితే, అతడు టీనేజ్‌లోకి రాగానే.. కాడెన్స్ మనసు మరిపోతుంది. అతడి అందం, బాడీని చూసి.. ప్రేమలో పడిపోతుంది. ఓ రాత్రి అనుకోకుండా గాట్‌ను గాఢంగా ముద్దు పెట్టుకుంటుంది. గాట్‌కు కూడా ఆమె అంటే ఇష్టం. దీంతో అతడు కూడా ఆమెను కాదనడు. అయితే, ఈ కథంతా.. కాడెన్స్ అపస్మారక స్థితిలో తీరంలో పడి ఉన్నప్పుడు మొదలవుతుంది. ఆమె ప్రమాదానికి గురికావడం వల్ల జ్ఞాపకశక్తిని కోల్పోతుంది. ఆమెకు గాట్ ముద్దు పెట్టుకున్నంత వరకే గుర్తు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అందుకే, ఓసారి అవన్నీ గుర్తు చేసుకోడానికి ఆమె మళ్లీ ఆ దీవికి వస్తుంది. అక్కడ మరోసారి తన ‘లయర్స్’ ఫ్రెండ్స్‌ను కలుస్తుంది.
ఒక ప్రేమ.. మరోవైపు ఆస్తుల గొడవ
మరోవైపు సిన్‌క్లెయిర్ ఫ్యామిలీకి చెందిన అక్కాచెల్లెళ్లు.. అంటే ఆ లయర్స్ పేరెంట్స్ ఆస్తుల కోసం పోట్లాడుకుంటూ ఉంటారు. అయితే, అది సంపన్నుల ఆస్తి గొడవ. చాలా డిగ్నిటీగా ఉంటుంది. ఈ స్టోరీకి పేర్లల్‌గా ఆస్తుల గొడవ నడుస్తుంది. నిజాలు తెలుసుకోవడం కోసం తిరిగి ఆ దీవికి వచ్చిన కాడెన్స్‌కు గాట్ ముద్దు పెట్టిన తర్వాత ఏం జరిగిందో గుర్తు వస్తుంది. అప్పటికే అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుస్తుంది. అదే సమయంలో తనకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ టిప్పర్ (ఎలిజబెత్ మిచెల్) చనిపోతుంది. దీంతో ఆమె భర్త, కాడెన్స్ తాత హారీస్ (బిన్ పుల్‌మాన్) తన జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు ఇంట్లోని ఇంటీరియర్, వస్తువులను మార్చాలని అనుకుంటాడు. కానీ ఇది కాడెన్స్‌కు అస్సలు ఇష్టం ఉండదు.
బ్రేకప్.. మళ్లీ ప్రేమ
గాట్‌కు అల్రెడీ గర్ల్‌ఫ్రెండ్ ఉందని తెలిసి కాడెన్స్.. అతడికి దూరమయ్యే ప్రయత్నం చేస్తుంది. ఓ రోజు లయర్స్ అంతా కలిసి పార్టీ చేసుకుంటారు.అందులో కాడెన్స్.. ఇతర అబ్బాయిలతో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తుంది. దీంతో గాట్.. తన గార్ల్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పాని చెబుతాడు. దీంతో గాట్, కాడెన్స్ మళ్లీ ప్రేమించుకుంటారు. మరోవైపు ఆమె సోదరి మిర్రెన్ ఓ బోటు నడిపే యువకుడితో ప్రేమలో పడుతుంది. అతడితో కలిసి లైట్ హౌస్‌కు వెళ్లి పనికానిస్తుంది.
ఊహించని ట్విస్ట్.. అనుకోని విషాదం
ఫ్యామిలీ పార్టీలో మరోసారి ఆస్తి కోసం వివాదం నెలకొంటుంది. దీంతో కాడెన్స్ తల్లి కోపంతో వీలునామాన్ని కాల్చేయాలని చెబుతుంది. అయితే, కాడెన్స్ లయర్స్ ఫ్రెండ్స్‌తో కలిసి ఏకంగా ఇంటినే కాల్చేస్తుంది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ వీలునామాలో ఆ దీవి మొత్తం కాడెన్స్ తల్లి పెన్నీకే రాస్తాడు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోతుంది. కానీ, ఇక్కడే ఎవరూ ఉహించని మరో ట్విస్ట్. అసలు కాడెన్స్ ప్రమాదానికి ఎలా గురైంది. రెండోసారి దీవికి వచ్చినప్పుడు.. తనతో మాట్లాడిన లయర్స్ (ఫ్రెండ్స్).. చివరి వరకు తనతోనే ఉన్నారా? అసలు వాళ్లు ఉన్నారా అనేది వెబ్ సీరిస్ చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి డోన్ట్ మిస్. ఈ వెబ్ సీరిస్ Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.
Also Read: Arabia Kadali OTT: నాగ చైతన్య ‘తండేల్’ కథతో వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?