Venky Atluri: సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎన్నో సరికొత్త సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే ఏదైనా ఒక కథను సిద్ధం చేసేటప్పుడు దర్శక నిర్మాతలు ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని ఆ సినిమాని సిద్ధం చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఆ హీరోలు ఆ సినిమాని చేయటానికి సిద్ధంగా ఉండరు. కథ నచ్చకపోవడం లేదా ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వంటి కారణాలవల్ల ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు.
ఏకంగా ఐదు సినిమాలు రిజెక్ట్..
ఇలా కొన్ని సినిమాలు రిజెక్ట్ చేయడం వల్ల డిజాస్టర్ సినిమాల నుంచి బయటపడిన హీరోలు ఉన్నారు అలాగే మంచి సక్సెస్ సినిమాలను మిస్ చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందిన వారిలో వెంకీ అట్లూరి(Venky Atluri) ఒకరు. ఈయన తెలుగులో ఇప్పటివరకు ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇటీవల ఈయన డైరెక్షన్లో వచ్చిన సార్, లక్కీ భాస్కర్ మంచి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
లక్కీ భాస్కర్..
వెంకీ అట్లూరి కెరియర్ మొదట్లో నటుడిగా పలు సినిమాలలో నటించారు. అలాగే కొన్ని సినిమాలకు రచయితగా కూడా పనిచేశారు. వరుణ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ సినిమా ద్వారా మొదటిసారి దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రం అఖిల్ అక్కినేనితో కలిసి మిస్టర్ మజ్ను అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నిరాశపరిచింది. అనంతరం నితిన్ తో కలిసి రంగ్ దే అనే సినిమా చేశారు ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. ఇక చివరిగా ఈయన కోలీవుడ్ హీరోలైన ధనుష్ తో కలిసి సార్, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
నాగచైతన్య ఫస్ట్ ఛాయిస్…
ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అందుకోవటం విశేషం. ప్రస్తుతం వెంకీ అట్లూరి హీరో సూర్యతో కలిసి మరో సినిమాకు కమిట్ అయ్యారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన సినిమాల గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇప్పటివరకు నేను చేసిన ఈ ఐదు సినిమాలు కథ సిద్ధం కాగానే ముందుగా వెళ్లి నాగచైతన్య(Nagachaitanya)కు చెప్పాను. అయితే నాగచైతన్య డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం, లేదా ఇతర సినిమా పనులలో బిజీగా ఉండటం వల్ల ఈ ఐదు సినిమాలను రిజెక్ట్ చేశారని విషయాలను బయటపెట్టారు. వెంకీ అట్లూరి ఈ విషయాన్ని వెల్లడించడంతో నాగచైతన్య అభిమానులు షాక్ అవుతున్నారు. లక్కీ భాస్కర్ సార్ వంటి సూపర్ హిట్ సినిమాలను అనవసరంగా మిస్ చేసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఐదు సినిమాలు కనుక నాగచైతన్య నటించి ఉంటే తన కెరియర్ మరోలా ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. ఇక హీరో సూర్య(Suriya) దర్శకత్వంలో రాబోయే సినిమా గురించి కూడా కొన్ని విషయాలు తెలియజేశారు. ఈ సినిమాలో సూర్యను మరో సంజయ్ రామ స్వామిగా చూడబోతున్నారు అంటూ సినిమాపై అంచనాలను పెంచేశారు.
Also Read: Manchu Vishnu: ప్రభాస్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన విష్ణు.. మళ్లీ ఏం చేస్తున్నావ్ సామి?