Harihara Veeramallu : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు.. డిప్యూటీ సీఏం అయ్యాక రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. జూలై 24 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఐదేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ మూవీ ఇన్నాళ్లకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది.ఆయన కెరీర్ లోనే ఇది తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.. సినిమా రిలీజ్ అవ్వక ముందు భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. రిలీజ్ అయ్యాక మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. అయితే ఈ మూవీ థియేటర్లలో పెద్దగా సక్సెస్ టాక్ ను అందుకోలేదు. కాబట్టి సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. ఎప్పుడు? ఎక్కడ? రాబోతుందో ఒకసారి తెలుసుకుందాం..
ఓటీటీలోకి వచ్చేస్తున్న వీరమల్లు..
హరిహర వీరమల్లు మూవీని క్రిష్ కొంత భాగం, జ్యోతికృష్ణ కొంత భాగం చిత్రీకరణ చేసిన ఈ మూవీ జూలై 24న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా డిక్లేర్ అయింది.. విజువల్ ఎఫెక్ట్స్ పూర్ గా ఉండటమే సినిమా రిజల్ట్ బ్యాడ్ గా రావడానికి కారణం అనే మాట వినిపిస్తుంది. అయితే ఈ మూవీని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ హక్కులను సొంతం చేసుకుంది. సినిమా రిజల్ట్ తేడా కొట్టడంత ఇప్పుడు కాస్త ముందుగానే ఓటిటిలో విడుదల చేయబోతున్నారు. ముందు అనుకున్నట్టుగా ఆగస్ట్ 22న కాకుండా ఆగస్ట్ 15నే ఈ మూవీ ఓటిటిలోకి రాబోతోందని టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.
Also Read :శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మిస్ అవ్వకండి..
ఫ్యాన్స్ కు మళ్లీ నిరాశ తప్పలేదా..?
పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడు ఒక్క సినిమా వస్తుంది అని ఫ్యాన్స్ తెగ వెయిట్ చేశారు. ఎంతో ఆశగా హరిహర వీరమల్లు గురించి వెయిట్ చేశారు. వచ్చిన సినిమా నిరాశ పడేలా చేసింది. స్టార్ హీరో సినిమా ఇలా ముందుగానే ఓటిటిలోకి రావడం అంటే ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇకపోతే ఈ మూవీలో పవన్ తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, దిలీప్ తాహిల్, సత్యరాజ్, రఘుబాబు, సచిన్ ఖేద్కర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. కీరవాణి సంగీతం అందించాడు. ఏఎమ్ రత్నం నిర్మాత.. ఈ మూవీ రిజల్ట్ అభిమానులను నిరాశ పరిచింది. దాంతో ఈ మూవీ త్వరగా థియేటర్లలోంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందరు ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25 న థియేటర్లలోకి రాబోతుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని చేస్తున్నాడు. ఈ మూవీ దాదాపుగా పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టారు. ఓజీ రిలీజ్ అయిన రెండు, మూడు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.