Gundeninda GudiGantalu Today episode August 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా కోసం ఈ స్కూటీ కొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని సత్యం కూడా తన కొడుకుని చూసి పొంగిపోతాడు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి మీనా కోసం ఇలాంటివి చేయడం చాలా సంతోషంగా ఉంది అని అందరూ బాలుపై పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఇంతకీ ఈ స్కూటీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి రాని అడుగుతాడు సత్యం. ప్రభావతి మాత్రం వాడు రౌడీయిజం చేసి రౌడీలను కొట్టి సంపాదించాడు అని అంటుంది. ఆ విషయం పట్టుకొని ఇంట్లో పెద్ద రచ్చ చేస్తుంది ప్రభావతి. నా ఇంట్లో ఉండనే ఉండదు వెళ్ళిపో అని బాలుని బయటకి గెంటేస్తుంది. అప్పుడే ఆ ఇంటికి రౌడీలు ఉన్న ఇంటి ఓనర్ వస్తాడు.. ఆయన ఇంటికి వచ్చి బాలు ఏ తప్పు చేయలేదని అసలు విషయం చెప్తాడు.. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ సంతోషపడతారు. బాలు చేసిన మంచి పనిని మెచ్చుకొని ప్రశంసలు కురిపిస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాత్రి మాత్రం రౌడీలను కొట్టి నాకు స్కూటీ కొన్నారా అని అరిచిన మీనా ఉదయం లేవగానే స్కూటీని అందంగా ముస్తాబు చేసి ఉంటుంది. ఇంట్లోనే వాళ్ళందరిని పిలిచి పూజ చేసి బాలు మీనా ఇద్దరు సరదాగా ఒక రౌండ్ వేసేస్తారు. వాళ్ళిద్దరిలా చక్కగా బయటికి వెళ్లడం బాగుంది అని సత్యం మురిసిపోతూ ఉంటాడు. ప్రభావతి రోహిణి మాత్రం ఇలా జరిగింది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు.. మనము పూల కొట్టును తీసేయించాలి అని అనుకుంటే భారీ కోసం బాలు ఏకంగా స్కూటీనే కొనిచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటారు.
మీనా ఆ స్కూటీ వేసుకుని పూలు ఇవ్వడానికని వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఏంటి మీనలాగా ఉందని కామాక్షి అక్కడికి వెళుతుంది. ఏంటి మీనా ఇదంతా అంటే.. ఆయన నా కోసం స్కూటీ కొన్నారు పిన్ని. నేను ఇంట్లో పని చేయడం ఇష్టం లేకే ఇలా సొంతంగా వ్యాపారం చేసుకోమని నాకోసం ఈ స్కూటీ కొనిచ్చారు అని బాలు గురించి గొప్పగా చెప్తుంది. అయితే కామాక్షి పోనీలే మంచి పని చేశాడు. నీ షాప్ పోయిందని నువ్వు బాధపడుతున్నావు అని అనుకున్నాను. ఇప్పుడు ఇలా పూలను అమ్మడం చూసి చాలా సంతోషంగా ఉంది అని అంటుంది..
ఇలానే మంచిగా వ్యాపారం చేసుకో కొద్ది రోజుల్లోనే నీ వ్యాపారం విస్తరిస్తుంది అని కామాక్షి అంటుంది. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఉంటే అలానే జరుగుతుందేమో అని మీనా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ప్రభావతి ఇంట్లో టెన్షన్ పడుతూ కోపంగా చిరాగ్గా ఉంటుంది. మనము పూలకట్టును లేపేస్తే.. ఆ బాలు గాడు ఏకంగా తన భార్య కోసం మొబైల్ స్కూటీని పెట్టించాడు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని ప్రభావతి అంటుంది. ఏది ఏమైనా కూడా ఇంటిముందు కొట్టు లేకుండా పోయింది అది సంతోషపడాలి అని అంటుంది.
అప్పుడే ప్రభావతికి కామాక్షి ఫోన్ చేసి మీనా ను ఇక్కడ చూశాను. బాలు మీనా కోసం స్కూటీ కొనిచ్చాడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. ఆ పూల బాక్స్ పై నీ నెంబర్ ఇవ్వలేదు. అది నువ్వు సంతోషించాలి అని కామాక్షి అంటుంది. అదే కనుక చేసింటే ఈపాటికి నువ్వు బిజీ అయిపోయిదానివే కదా అని కామాక్షి అంటుంది. ప్రభావతి ఒక్కసారిగా ఆ పరిస్థితిని ఊహించుకొని షాక్ అవుతుంది. వామ్మో ఇలాంటి పరిస్థితి నాకు వస్తే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి ప్రభావతిని కావాలని రెచ్చగొడుతుంది. ఈ కామాక్షి ఒకటి ఏదనిపిస్తే అది అంటుంది. కావాలని అంటుందో జరగబోయేది అంటుందో తెలియదు గానీ కచ్చితంగా అన్నది మాత్రం జరిగేలా కనిపిస్తుంది అని తిట్టుకుంటూ ఉంటుంది. రోహిణి మాత్రం బాలు సమస్య తీరింది ఇక ఈవిడ నా మీద వచ్చి పడేలా ఉంది అని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…