OTT Movie : ఓటీటీలోకి సరికొత్త స్టోరీలతో, కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ సినిమాలు, ఫ్యామిలీ డ్రామా ఇష్టపడే వాళ్లకి అదిరిపోయే స్టోరీతో ఒక తమిళ మూవీ ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా దర్శకుడే ఇందులో హీరో పాత్రలో నటించి , మెప్పించాడు. ఈ స్టోరీ ఒక పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ హత్యల చుట్టూ తిరుగుతుంది. ప్రతి క్షణం ఉత్కంఠంగా నడిచే ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఏ ఓటీటీలో ఉందంటే
‘గట్స్’ (Guts) 2025లో విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనికి రంగరాజ్ దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా నీతి, న్యాయం, కుటుంబ బంధాల వంటి అంశాల చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ థ్రిల్లర్. రంగరాజ్ ఇందులో డబుల్ రోల్ పాత్రల్లో (తండ్రి, కొడుకు) నటించాడు. శ్రుతి నారాయణన్, నాన్సీ, ఢిల్లీ గణేష్, సాయి దీనా లాంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం, మనోజ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. 2025 జూన్ 13న థియేటర్లలో విడుదలై, 2025 ఆగస్టు 1 నుంచి టెంట్‌కొట్ట (Tentkotta) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో 7.8/10 రేటింగ్‌తో, ఈ సినిమా ప్రశంసలు అందుకుంటోంది.
స్టోరీలోకి వెళితే
రంగరాజ్ అనే అబ్బాయి, తన అమ్మ కోరిక మేరకు పోలీస్ ఆఫీసర్ అవుతాడు. నిజాయితీగా ధైర్యంగా డ్యూటీ చేస్తూ, శ్రుతి ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు. ఈ జంట జీవితం సూపర్‌గా సాగుతుంటే, ఒక రోజు రంగరాజ్ భార్య, గర్భవతిగా ఉండగా, ఎవరో దారుణంగా కత్తితో పొడిచి చంపుతారు. ఈ షాక్‌తో రంగరాజ్ లైఫ్ తల్లకిందులవుతుంది. అక్కడితో ఆగదు, రంగరాజ్‌కి తన అమ్మ, నాన్నలు కూడా గతంలో హత్యకు గురయ్యారని తెలుస్తుంది. ఇది విని రంగరాజ్ పూర్తిగా కుంగిపోతాడు. భార్యని చంపిన వాళ్లని పట్టుకోవాలని, ఈ హత్యల వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలని రంగరాజ్ ఒక డిటెక్టివ్‌లా దర్యాప్తు మొదలెడతాడు. ఈ సర్చ్‌లో రంగరాజ్ కి తన నాన్న హత్యతో కనెక్ట్ అయిన కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి.
Read Also : అర్ధరాత్రి ఆ పని చేసే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… పోలీసులకు చెమటలు పట్టించే సైకో కేసు