E-Paper
Advertisement

త్రినాధరావు నక్కిన మ్యాజిక్ మళ్లీ స్టార్ట్… హవీష్ సాంగ్ వైరల్!

త్రినాధరావు నక్కిన మ్యాజిక్ మళ్లీ స్టార్ట్… హవీష్ సాంగ్ వైరల్!
Advertisement

Havish Movie:జీనియస్, 7 సినిమాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హవీష్ ఈసారి మరి సాలిడ్ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాడు.ఈ క్రమంలోనే కామెడీ ఎంటర్‌టైనర్స్‌తో వరుస హిట్లు కొట్టిన త్రినాధరావు నక్కినతో చేతులు కలిపాడు.ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ ఫుల్ ఎంటర్‌టైనర్ లో హవీష్ కి జోడీగా కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఇక  ఈ సినిమాని సత్యనారాయణ కోనేరు, నిఖిల కోనేరు  ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా ఇప్పుడు సినిమా నుండి మరో క్రేజీ సాంగ్ వచ్చేసింది.”కొంచెం కొంచెం”అంటూ సాగే ఈ పాట  రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో  వైరల్ అయిపొయింది.ఇక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో అప్పుడే చక్కర్లు కొట్టేస్తుంది కూడా.

Advertisement

కొంచెం కొంచెం మత్తుగా

“కొంచెం కొంచెం కొత్తగా… కొంచెం కొంచెం మత్తుగా…” అంటూ సాగే ఈ సాంగ్ వింటున్న కొద్దీ చాలా మళ్లీ మళ్లీ వినాలనిపించేలా మ్యూజిక్ కంపోజ్ చేశారు. దానికి తోడు హవీష్, కావ్య థాపర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది.ఇక వీరు ఇద్దరూ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నారనేది నెటిజన్ల నుండి వినిపిస్తున్న టాక్ .

Advertisement

ఇక త్రినాధరావు నక్కిన విషయానికి వస్తే  ‘సినిమా చూపిస్తా మావ’, ‘నేను లోకల్’, ‘ధమాకా’ లాంటి సినిమాలతో ఆయనకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడనే చెప్పాలి. ముఖ్యంగా 2022 డిసెంబర్ 23న వచ్చిన ‘ధమాకా’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. నవ్వులు, రొమాన్స్, ఎమోషన్, కమర్షియల్ మసాలా… ఇవన్నీ కలిపి ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు హవీష్‌తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారట.

ఇక ఈ సినిమాలో హవీష్ లుక్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇంతకు ముందు కనిపించిన దానికంటే చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కామెడీ టైమింగ్‌పై కూడా ఈసారి బాగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు కావ్య థాపర్ కూడా గ్లామర్ మాత్రమే కాదు,కథలో కీలకమైన పాత్రలో కనిపించబోతుందనే టాక్ వినిపిస్తోంది.

సినిమా మీద హైప్ ఇంకో లెవల్‌

మరో విషయం ఏమిటంటే… మూవీ టీమ్ ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా తెలివిగా ముందుకెళ్తోంది. ఒకేసారి అన్నీ రిలీజ్ చేయకుండా, ఒక్కో అప్‌డేట్‌తో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముందు పోస్టర్లు, తర్వాత గ్లింప్స్… ఇప్పుడు ఈ రొమాంటిక్ సాంగ్. త్వరలో టీజర్, ట్రైలర్ కూడా వస్తే సినిమా మీద హైప్ ఇంకో లెవల్‌కి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.

ప్రస్తుతం “కొంచెం కొంచెం” పాటకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మ్యూజిక్ పరంగా సినిమా సగం  విజయం సాధించినట్టే అనిపిస్తోంది. మిగతా ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇదే రేంజ్‌లో ఉంటే హవీష్ కెరీర్‌లో ఈ సినిమా మంచి కమ్‌బ్యాక్ మూవీ అయ్యే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.మరి కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎలా ఆకట్టుకుంటుందో రిలీజ్ రోజే తేలిపోవాలి!

 

Related News

భాగవతం కథతో పాన్ ఇండియా ప్లాన్.. ఏకంగా 7 సినిమాలు!

షూటింగ్‌కు బ్రేక్.. పిల్లలతో స్పైడర్‌మ్యాన్ చూసిన బన్నీ!

ఎవరికి ఏం జరిగినా చిరునే కావాలా..? ఇదేం లాజిక్..!

విశ్వంభరా… వస్తున్నావా..? లేక ఊరికే చెబుతున్నావా..?

అరుదైన మొక్కకి పవన్ కళ్యాణ్ పేరు..అసలు స్టోరీ ఇదే!

అనసూయపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. ఛీ అవేం మాటలు?

బోయపాటి నన్ను చూసి మోసపోయాడు….తీన్మార్ చంద్రవ్వ షాకింగ్ కామెంట్స్ !

Big Stories

Advertisement
×