E-Paper
Advertisement

బాబ‌ర్ ఇండియాలో పుట్టింటే, విరాట్ కోహ్లీని మించిపోయేవాడు

బాబ‌ర్ ఇండియాలో పుట్టింటే, విరాట్ కోహ్లీని మించిపోయేవాడు
Advertisement

Kamran Akmal On Babar Azam: వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ (West Indies vs Pakistan) మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ జూలై 25వ తేదీన ప్రారంభమైంది. అయితే ఇందులో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్… 90 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. అటు ఎప్పటిలాగే పాకిస్తాన్ మరో ఓటమిని చవిచూసింది. కెప్టెన్ ను మార్చిన కూడా పాకిస్తాన్ తలరాత మారలేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ కొత్త కెప్టెన్ బాబర్ ఆజం పైన దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

బాబ‌ర్ ఇండియాలో పుట్టింటే, విరాట్ కోహ్లీని మించిపోయేవాడు

అయితే విమర్శలను ఎదుర్కొంటున్న బాబర్ ఆజంకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ (Kamran Akmal ) సపోర్ట్ గా నిలిచాడు. పాకిస్తాన్ లో బాబర్ ఆజం ( Babar Azam ) జన్మించి పెద్ద తప్పు చేశాడని.. అదే ఇండియాలో అతడు పుట్టి ఉంటే, విరాట్ కోహ్లీ కంటే గొప్ప ఆటగాడు అయ్యేవాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో జన్మించిన బాబర్ ఆజంకు నిత్యం అవమానాలే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బాబర్ ఆజం పై కమ్రాన్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కెప్టెన్ గా ఉన్న బాబర్ ఆజం ఇండియాలో పుట్టి ఉంటే… అతని తలరాత మారేదని వ్యాఖ్యానించారు. ఆ దేశంలో జన్మించి ఉంటే, భారత జట్టులో అద్భుతంగా రాణించేవాడని వెల్లడించారు. విరాట్ కోహ్లీని మించిపోయి, ఎన్నో రికార్డులు సృష్టించేవాడని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ చుట్టూ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్ లాంటి బలమైన క్రికెటర్లు ఉన్నారు… అందుకే టీమిండియా అద్భుతంగా ముందుకు వెళుతోందని వ్యాఖ్యానించారు.

విరాట్ కోహ్లీ లాగా బ‌ల‌మైన స‌పోర్ట్ బాబ‌ర్ ఆజంకు లేదు

Advertisement

టీమిండియా జట్టులో విరాట్ కోహ్లీకి మంచి సపోర్ట్ దొరుకుతోంది కాబట్టే… అతడు వరల్డ్ క్లాసు ప్లేయర్ అయ్యాడని గుర్తు చేశారు. కానీ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో మాత్రం బాబర్ ఆజం పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అతడికి పాకిస్తాన్ క్రికెటర్లు ఎవరు సపోర్ట్ చేయడం లేదని బాంబు పేల్చారు. వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడానికి కూడా ఇదే కారణం అన్నారు. బాబర్ ఆజం కెప్టెన్సీలో పాకిస్తాన్ ఓడిపోవాలని కుట్ర జరిగిందని.. అతన్ని బ్లేమ్ చేసేందుకే సొంత ప్లేయర్లు ట్రై చేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఇక‌నైనా పాకిస్తాన్ క్రికెట‌ర్లు ( Pak players) అంద‌రూ బాబ‌ర్ ఆజంకు స‌పోర్ట్ గా ఉండాల‌ని కోరారు. అప్పుడు పాకిస్తాన్ గెలుస్తుంద‌ని వివ‌రించారు.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

 

Related News

డ్రెస్సింగ్ రూమ్ వైపు దొంగ చూపులు చూసి రివ్యూలు తీసుకునేవారు – పుజారా

గంగూలీ క్రికెట్ కు పనికిరాడంటూ మెయిల్…గ్రెగ్ చాపెల్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఫ్యాన్స్

ఒరేయ్ నఖ్వీ… నీకు ఏది చేతకాదు కానీ, ఆసియా కప్ అయినా దొంగిలించు !

ఆస్ట్రేలియాకు వెళ్ళాక టీమిండియా నుంచి ధోని తరిమేశాడు..సెహ్వాగ్ సంచలనం !

వహాబ్ రియాజ్ కోచ్ కాదు…వాడు పెద్ద కామాంధుడు, డ్రెస్సింగ్ రూమ్ లోనూ వదలడు !

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

Big Stories

Advertisement
×