HBD Akaash Puri: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచిది సక్సెస్ అందుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కుమారుడిగా ఆకాష్ పూరి(Akaash Puri) అందరికీ ఎంతో సుపరిచితమే. తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాలలో బాల నటుడిగా తన సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆకాష్ అనంతరం హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆకాష్ నేడు పుట్టినరోజు (Birthday)జరుపుకుంటున్న నేపథ్యంలో అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఆకాష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ జర్నీ గురించి ఇక్కడ తెలుసుకుందాం…
బాలనటుడిగా మొదలైన ప్రయాణం..
పూరి జగన్నాథ్, లావణ్య(Lavanya) దంపతులకు మొదటి సంతానం అనే విషయం మనకు తెలిసిందే. ఇక తన తండ్రి ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆకాష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా(Child Artist) ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2007లో పూరి డైరెక్షన్ లో రాంచరణ్ హీరోగా నటించిన చిరుత సినిమా ద్వారా బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆకాష్ అనంతరం బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, ది లోటస్ పాండ్, బిజినెస్ మెన్, ధోని వంటి పలు సినిమాలో హీరో చిన్నప్పటి పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
నిరాశ పరుస్తున్న సినిమాలు…
ఇలా బాల నటుడిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఆకాష్ ఆంధ్రా పోరి(Andhra Pori) అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో తన నటన ద్వారా పరవాలేదు అనిపించుకున్న సినిమా మాత్రం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలలో హీరోగా నటించారు కానీ ఏ ఒక్క సినిమా కూడా తనకు సరైన గుర్తింపును తీసుకురాలేకపోయింది. గొప్ప డైరెక్టర్ అయినప్పటికీ ఇప్పటివరకు తన తండ్రి డైరెక్షన్ లో మాత్రం ఆకాష్ నటించలేదని చెప్పాలి. ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాతనే తన తండ్రితో సినిమా చేస్తానని తెలియజేశారు.
హీరోగా నిరూపించుకోవడం…
ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి వార్తలలో తాను నిలవకూడదన్న ఉద్దేశంతోనే తన తండ్రి సినిమాలలో ఇప్పటివరకు నటించలేదని ఒక మంచి హిట్ కొట్టి హీరోగా తనని తాను నిరూపించుకున్న తరువాతే నాన్న సినిమాలో నటిస్తానని ఆకాష్ తెలియజేశారు. ఇక చోర్ బజార్ తర్వాత ఇప్పటివరకు కొత్త సినిమాని ప్రకటించలేదు అయితే ప్రస్తుతం పలు సినిమాల పనులలోనే ఆకాష్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని అందించారు. ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ సైతం వరుస ఫ్లాప్ సినిమాలతో ఎంతో సతమతమవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈయన కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
Also Read: War 2Trailer: వార్ 2 ట్రైలర్ పై అల్లు హీరో ప్రశంసలు.. ఏకిపారేస్తున్న మెగా ఫాన్స్?