Realme 15 | రియల్మీ సంస్థ ఇండియాలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు.. రియల్మీ 15, రియల్మీ 15 ప్రో.. అలాగే రియల్మీ బడ్స్ T200 విడుదల చేసింది. ఈ డివైస్‌లు.. పెద్ద బ్యాటరీలు, వేగవంతమైన ఛార్జింగ్, అధిక పనితీరు, స్మార్ట్ AI ఫీచర్లతో సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయి.
రియల్మీ 15: పవర్‌ఫుల్ పర్‌ఫామెన్స్
రియల్మీ 15 ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300+ 5G చిప్‌సెట్ ఉంది, ఇది వేగవంతమైన కనెక్టివిటీ మరియు సాఫీగా పనిచేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది. దీనివల్ల యూజర్లు ఎక్కువ సమయం ఫోన్ ఉపయోగించవచ్చు.
ఈ ఫోన్‌లో 6.8 ఇంచెస్ 4D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది, 144Hz రిఫ్రెష్ రేట్.. 6,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో బయట ఎండలో కూడా వీడియోలు చూడటం, గేమింగ్ చేయడం కూడా సులభం. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్మీ UI 6.0తో పనిచేస్తుంది.
రియల్మీ 15 మెమరీ ఆప్షన్లు, ధరలు:
8GB RAM + 128GB స్టోరేజ్: Rs 23,999
8GB RAM + 256GB స్టోరేజ్: Rs 25,999
12GB RAM + 256GB స్టోరేజ్: Rs 28,999
ఈ ఫోన్ జూలై 30, 2025 నుండి ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్లోయింగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్, సిల్క్ పింక్ రంగులలో వస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో Rs 1,500 తగ్గింపు లేదా Rs 5,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
కెమెరా విషయానికొస్తే, రియల్మీ 15లో 50MP సోనీ IMX882 AI కెమెరా, 8MP వైడ్-యాంగిల్ కెమెరా, మరియు 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. AI ఎడిట్ జీనీ వంటి స్మార్ట్ ఫీచర్లు వాయిస్ కమాండ్‌తో ఫోటోలను ఎడిట్ చేయడానికి, AI పార్టీ ఫీచర్ లొకేషన్ ఆధారంగా కెమెరా సెట్టింగ్‌లను సర్దుబాటు చేస్తుంది.
రియల్‌మీ 15 ప్రో.. అడ్వాన్స్ ఫీచర్స్
రియల్‌మీ 15 ప్రో అనేది మరింత శక్తివంతమైన వెర్షన్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. ఇది కూడా 6.8 ఇంచెస్ 4D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 6,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్మీ UI 6.0తో పనిచేస్తుంది.
కెమెరా సెటప్‌లో 50MP సోనీ IMX896 (OISతో), 50MP అల్ట్రా-వైడ్, 50MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇవి అద్భుతమైన ఫోటోలను అందిస్తాయి.
రియల్మీ 15 ప్రో – మెమరీ ఆప్షన్లు, ధరలు:
8GB + 128GB: Rs 31,999
8GB + 256GB: Rs 33,999
12GB + 256GB: Rs 35,999
12GB + 512GB: Rs 38,999
ఇది ఫ్లోయింగ్ సిల్వర్‌తో సహా ఇతర రంగులలో అందుబాటులో ఉంటుంది. Rs 2,000 బ్యాంక్ డిస్కౌంట్, Rs 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి.
రియల్మీ బడ్స్ T200: సరసమైన ఎయర్‌బడ్స్
రియల్మీ బడ్స్ T200 వైర్‌లెస్ ఎయర్‌బడ్స్ Rs 1,999 ధరతో (లాంచ్ ఆఫర్‌తో Rs 1,799) అందుబాటులో ఉన్నాయి. ఇవి మిస్టిక్ గ్రే, స్నోవీ వైట్, డ్రీమీ పర్పుల్, నియాన్ గ్రీన్ రంగులలో వస్తాయి.
Also Read: 12GB ర్యామ్‌తో టాప్ 5 హై స్పీడ్ స్మార్ట్‌ఫోన్లు.. 2025 మిడ్ రేంజ్‌లో సూపర్ ఫోన్స్ ఇవే..
రియల్మీ 15 సిరీస్, బడ్స్ T200 సరసమైన ధరలో అడ్వాన్స్ ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. భారతీయ మిడిల్ క్లాస్ కస్టమర్లకు ఇవి సూపర్ ఆప్షన్స్.