War 2 Trailer: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించి తాజా చిత్రం వార్ 2(War 2). ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా హై వోల్టేజ్ యాక్షన్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 14వ తేదీ అత్యంత భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల (Trailer Release)చేశారు. నేడు ఉదయం విడుదలైన ఈ ట్రైలర్ కు భారీ స్థాయిలో స్పందన లభిస్తుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ పై సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
వార్ 2 ట్రైలర్ పై స్పందించిన శిరీష్…
ఈ క్రమంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఇప్పటివరకు ఎవరు స్పందించకపోయిన అల్లు శిరీష్ (Allu Shirish)వార్ 2 ట్రైలర్ పై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా అభిమానుల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధానికి కూడా కారణమైందని చెప్పాలి. ఈ సందర్భంగా అల్లు శిరీష్ వార్ 2 ట్రైలర్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ…”పిచ్చి ట్రైలర్!!! తారక్ అన్న హృతిక్ రోషన్ సర్ ను ఇలా స్క్రీన్ పై చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇలా వీరిద్దరి కలయిక బాలీవుడ్ అలాగే సౌత్ సినీ ఇండస్ట్రీ మధ్య నిజమైన సహకారం అని తెలిపారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే ఇంటర్నేషనల్ సినిమాని తలపిస్తుందని మిమ్మల్ని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
పెయిడ్ ట్వీట్ అంటూ విమర్శలు..
ప్రస్తుతం అల్లు శిరీష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా అల్లు, ఎన్టీఆర్ అభిమానులు ఈయన చేసిన ట్వీట్ పై ప్రశంసలు కురిపించగా మెగా అభిమానులు (Mega Fans) మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పెయిడ్ ట్వీట్ అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది… పొగుడుతున్నావా? ట్రోల్ చేస్తున్నావా? అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన ఇప్పటివరకు అల్లు కుటుంబం సభ్యులు ఎవరు కూడా స్పందించలేదు.
Insane trailer!!! 🔥🤯🥊 So excited to see Tarak anna @tarak9999 and @iHrithik sir light up the screen like this! A true collab between Bollywood & South. The visuals are like an international film! Excited to see this on the big screen! #War2 https://t.co/omivLPlZ3j
— Allu Sirish (@AlluSirish) July 25, 2025
ఈ క్రమంలోనే పవన్ సినిమాపై స్పందించకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అల్లు శిరీష్ పై విమర్శలు కురిపిస్తూ ఈయన చేసిన ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు. ఇలా అల్లు శిరీష్ ట్వీట్ కారణంగా సోషల్ మీడియాలో మెగా వెర్సెస్ అల్లు అనే విధంగా వివాదాలు జరగడమే కాకుండా ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ సైతం విమర్శలు కురిపిస్తున్నారు. ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే ఈయన 2013 వ సంవత్సరంలో గౌరవం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే పలు సినిమాలలో అల్లు శిరీష్ నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇక శిరీష్ చివరిగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత తదుపరి ఎలాంటి సినిమాలను ప్రకటించలేదని చెప్పాలి.
Also Read: Janhvi Kapoor: ఒంటి నిండా గాయాలతో పెద్ది బ్యూటీ… ఆందోళనలో ఫ్యాన్స్!