HBD Fahad fazil:మలయాళ సినీ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఫహద్ ఫాజిల్ (Fahad fazil) దేశం మెచ్చిన నటుడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈయనకు అభిమానులుగా మారిపోయారు. అంతేకాదు స్టార్ హీరోయిన్స్ త్రిష (Trisha Krishnan), అలియా భట్ (Alia Bhatt) లాంటి హీరోయిన్స్ కూడా ఈయనతో ఒక్క ఛాన్స్ కావాలి అని కోరుకుంటున్న విషయం తెలిసిందే. అలా విలక్షణ నటనతో పేరు సొంతం చేసుకున్న ఈయన పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఫహద్ ఫాజిల్ లగ్జరీ లైఫ్ ను చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వేయక మానదు. ముఖ్యంగా ఆయన కార్ గ్యారేజీలో ఉండే కార్ కలెక్షన్స్ విలువ తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
ఫహద్ ఫాజిల్ కార్ కలెక్షన్స్..
ఫహద్ ఫాజిల్ కార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. గత నెల దాదాపు రూ.53 లక్షల విలువైన ‘వోక్స్ వ్యాగన్ గోల్ఫ్ GTI కారు’ కొనుగోలు చేశారు. ఇది గ్రెనడిల్లా బ్లాక్ మెటాలిక్ రంగులో ఉంది. సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వచ్చే ఈ కార్ కేవలం 5.9 సెకండ్లలో 0 – 100 కి.మీ/గం.కు చేరుకుంటుంది. ఇక ఈ కారుతో పాటు ఈయన కారు గ్యారేజీలో అనేక ఇతర అన్యదేశ కార్లు కూడా ఉండడం గమనార్హం. వాటిలో మినీ కంట్రీ మ్యాన్, లంబోర్ఘిని ఉరుస్, పోర్షే 911, ల్యాండ్ రోవర్ డిఫెండర్ వంటి కార్లు ఉన్నాయి. నిత్యం బయటికి చాలా సింపుల్ గా కనిపించే ఫహద్ ఫాజిల్ కార్ గ్యారేజీలో ఇన్ని మోడ్రన్ ఖరీదైన కార్లు ఉన్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఫహద్ ఫాజిల్ సినిమా జీవితం..
1982 ఆగస్టు 8న కేరళలో జన్మించిన ఈయన.. తొలిసారి తన తండ్రి, దర్శకుడు ఫాజిల్ (Fazil) దర్శకత్వం వహించిన ‘కైయేతుమ్ దూరత్’ (2002) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ‘ బెంగళూరు డేస్’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, ఈ సినిమాతో కూడా డిజాస్టర్ ను అందుకున్నారు.. ఇక తర్వాత 2016లో ‘ మాన్ సూన్ మామిడి’ సినిమాలో నటించారు. ఈ సినిమా డిజాస్టర్ అయినా ఇతని నటనకు ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత ‘మహేషింతే ప్రతీకారం’ అనే సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు.
ఫహద్ ఫాజిల్ తెలుగు సినిమాలు..
అలా మలయాళ నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన.. తొలిసారి అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్ ‘ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో ‘భన్వర్ సింగ్ షేకావత్ ఐపీఎస్’ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు తెలుగు, తమిళ్ చిత్రాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మించారు. చివరిగా ‘ప్రేమలు’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించి.. మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ALSO READ:Sree Leela: నిర్మాతల పాలిట గోల్డెన్ డక్.. నిజమే సుమీ!