OTT Movie : రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఒక రిచ్ బిజినెస్‌మన్ హత్య చుట్టూ తిరిగే కథతో రూపొందింది. ఇందులో బో*ల్డ్ సన్నివేశాలు, సెన్సిటివ్ థీమ్స్ ఉన్నాయి. ఈ కథలో రొమాన్స్, లస్ట్, మోసం ఈ మర్డర్ మిస్టరీని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి.అయితే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అన్నట్లు ఉంటుంది. ఫ్యామిలీతో కలసి చేసేవిధంగా ఉండదు. దీనిని చూసేవాళ్ళెవరైనా ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
ఏ ఓటీటీలో ఉందంటే
‘Naked: The Lust’ (2020) ఒక తెలుగురొమాంటిక్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. దీనికి SKN దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2020 డిసెంబర్ 12న విడుదలైంది. ఇది హంగామా ప్లే, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్లాట్ ఫామ్‌లలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఇందులో శ్రీ రాపాక, అమిత్ తివారీ, మేఘన చౌదరి, ఆర్చన సింగ్ రాజ్‌పుట్, చత్రపతి శేఖర్, ఆనంద్ భారతి నటించారు. ఈ సినిమా 48 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది. IMDbలో 5.9/10 రేటింగ్ ను పొందింది.
స్టోరీలోకి వెళితే
ఒక ధనవంతుడైన బిజినెస్‌మన్ మిస్టీరియస్‌గా హత్య చేయబడతాడు. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎటూ తేల్చలేకపోతారు. పోలీసులు ఇంట్లో పనిచేసే మెయిడ్, ఆమె భర్త, బిజినెస్‌మన్‌తో చిన్న గొడవలు ఉన్న ఒక పొరుగు వ్యక్తితో పాటు కొంత మందిని అనుమానిస్తారు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ హత్య వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుస్తుంది. ఇక ఈ కథలో ఒక ముఖ్యమైన థ్రెడ్ బిజినెస్‌మన్ భార్య చుట్టూ తిరుగుతుంది. ఆమె తన వివాహంలో సంతృప్తి లేక, పొరుగు వ్యక్తితో అఫైర్‌లో పడుతుంది. ఈ సంబంధం ఆమెకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ అఫైర్, హత్య మధ్య ఒక లింక్ ఉందని క్రమంగా బయటపడుతుంది.
ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తికి, పనిమనిషికి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఈ కేసును డీప్‌గా ఇన్వెస్టిగేట్ చేస్తూ, అనేక ట్విస్ట్‌లు, రివీల్స్ ద్వారా హత్యకు గల కారణం, హంతకుడు ఎవరనే రహస్యాన్ని కనుగొంటారు. హంతకుడు ఎవరు ? ఎందుకు చంపారు ? పోలీసులు హంతకున్ని ఎలా కనిపెట్టారు ? పనిమనిషికి ఇందులో సంబంధం ఉందా ? అనే ప్రశ్నలకి సమాధానాలు కావాలనుకుంటే, ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : ఇంట్లో ఒంటరిగా ఉండే భార్య… పట్టపగలే చుక్కలు చూపించే దెయ్యం… ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తెలిస్తే దిమాక్ కరాబ్