BigTV English

HBD Keeravani: స్వరాల మాంత్రికుడు.. ఆస్కార్ అవార్డు గ్రహీత.. కీరవాణి బర్త్ డే స్పెషల్!

HBD Keeravani: స్వరాల మాంత్రికుడు.. ఆస్కార్ అవార్డు గ్రహీత.. కీరవాణి బర్త్ డే స్పెషల్!

HBD Keeravani: నాటు.. నాటు.. అంటూ తన అద్భుతమైన మ్యూజిక్ తో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడమే కాకుండా అందరితోనూ స్టెప్పులు వేయించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (M.M.Keeravani)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత దర్శకుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు (Birthday)శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక విశ్వంభర(Vishwambhara) చిత్ర బృందం కూడా ప్రత్యేకంగా పోస్టర్ విడుదల చేస్తూ కీరవాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కీరవాణి గారు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన సినీ ప్రస్థానం గురించి ఓసారి ఇక్కడ తెలుసుకుందాం…


పుట్టినరోజు శుభాకాంక్షలు…

కీరవాణి గారు 1990వ సంవత్సరం మనసు మమత అనే సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈ సినిమాలోని పాటలు సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయన కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. కీరవాణి సంగీత సారధ్యంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయిబాబా వంటి భక్తి సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో ప్రేమ కథ సినిమాలకు సంగీతం అందించారు. ఇక బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.


నాటు.. నాటు పాట…

ఇలా కీరవాణి తన సంగీత స్వరాలు ప్రేక్షకులను ఎంతగానో మైమరిపించాయనే చెప్పాలి. ఆయన పాటల్లో కొత్తదనం, మనసుకు హాయినిచ్చే మధురానుభూతిని కలిగిస్తుంది. ఇలా సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న ఈయన కెరియర్ కు ఆర్ఆర్ఆర్ సినిమా(RRR Movie ) పెద్ద మైలురాయి లాంటిదని చెప్పాలి. ఈ సినిమాతో తన జీవితమే మారిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ నటించారు. ఇక వీరిద్దరితో రాజమౌళి వేయించిన నాటు నాటు స్టెప్పులకు కీరవాణి సంగీతంతో ప్రపంచం కూడా డాన్స్ వేసిందని చెప్పాలి.

ఆస్కార్ అవార్డు విజేత…

ఈ పాట ఏకంగా ఆస్కార్ అవార్డు(Oscar Award)కు ఎంపిక అవ్వటమే కాకుండా అవార్డును కూడా కైవసం చేసుకోవడంతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి తెలిసిందనే చెప్పాలి . కీరవాణి గారు ఒక గొప్ప సంగీత దర్శకుడు మాత్రమే కాకుండా, ఆయన మంచితనం, ఆయన నిరాడంబరత, వినయం అందరికీ ఆదర్శం. కీరవాణి గారు సినిమాలలో బిజీగా ఉండటమే కాకుండా, బుల్లితెర కార్యక్రమాలలో కూడా బిజీగా గడుపుతున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు కూడా ఈయన జడ్జిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఇక నేడు ఈయన పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో కీరవాణి గారు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అభిమానులు, సినిమా సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: రేపిస్ట్ తో నయన్ దంపతులు..బుద్ధుందా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్!

Related News

Andhra King Taluka: రిలీజ్ డేట్ ఫిక్స్, హే రామ్ ఒక్క హిట్ ప్లీజ్

Chiranjeevi: చిరంజీవి గొప్ప మనసు.. ఆ హీరో అప్పులు తీర్చేసిన మెగాస్టార్‌..

Prabhas: మహాభారతంలోని పాత్రతో ప్రభాస్ మూవీ… డార్లింగ్‌కు సరిగ్గా సెట్!

Jr.NTR: ఎమ్మెల్యే ఆడియో లీక్ చేసింది నేనే.. ఇప్పుడు ప్రాణ హాని – ఎన్టీఆర్ ఫ్యాన్

Chiranjeevi : చిరు బర్త్‌డే ట్రీట్… యంగ్ డైరెక్టర్‌తో మరో సినిమా.. రేపే అనౌన్స్‌మెంట్

Akhanda 2 Postponed: ఆ రూమర్సే నిజమయ్యాయి… అఖండ 2 వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

Big Stories

×