India Tour of Bangladesh: భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టూర్ ముగిసిన అనంతరం బంగ్లాదేశ్ తో వన్డే, టి-20 సిరీస్ ఆడడానికి భారత జట్టు బంగ్లాదేశ్ వెళ్లాల్సి ఉంది. ఆగస్టులో జరగాల్సిన ఈ పర్యటనపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఈ పర్యటనకు భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా..? లేదా..? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.
Also Read: Shubman Gill: కోహ్లీ కోసం ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్న గిల్… అసలు కారణం ఇదే
రాజకీయ ఉద్రిక్తతల కారణంగా టూర్ రద్దు?
ప్రస్తుతం బంగ్లాదేశ్ – భారత్ మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ సిరీస్ లు జరగడం అసంభవం అనిపిస్తోంది. కానీ బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ మాత్రం ఈ సిరీస్ లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆగస్టులో ఈ సిరీస్ లు వీలుకాకపోతే.. ఆ తర్వాత అయినా భారత జట్టు తమ దేశానికి రావాలని అతడు ఆశిస్తున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మాట్లాడుతూ.. ” ఈ పర్యటనకు సంబంధించి మేము బీసీసీఐ తో నిరంతర చర్చలు జరుపుతూనే ఉన్నాం.
వారు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ సిరీస్ లను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు వీలుకాకుంటే.. ఆ తర్వాత అయినా భారత్ కి ఆతిథ్యం ఇస్తామన్న నమ్మకం మాకు ఉంది. భారత్ ఇంకా అధికారికంగా ఈ పర్యటనను వాయిదా వేయలేదు. టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన అనేది ప్రభుత్వం నుండి అనుమతి లభించడంపై ఆధారపడి ఉంది” అని బోర్డు మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మరోవైపు క్రీడాభిమానులు కూడా భారత్.. బంగ్లా పర్యటనకి వెళ్లాలని కోరుకుంటున్నారు.
బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే.. ?
ఒకవేళ భారత జట్టు ఆగస్ట్ నెలలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోతే.. బీసీబి ఐపీఎల్ – 2026 వరకు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే వచ్చే ఏడాది జనవరిలో జరిగే టి-20 ప్రపంచ కప్ వరకు టీమిండియా షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడిన భారత్.. ఆ తరువాత ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడింది.
Also Read: Football Player Death: 10 రోజుల కిందటే పెళ్లి.. అంతలోనే కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి
అది ముగిసిన కొన్ని రోజులకే ఐపీఎల్ ప్రారంభమైంది. ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ వెళ్ళింది. ఈ పర్యటన జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. అక్కడినుండి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఆ వెంటనే సౌతాఫ్రికా సిరీస్ ఉంది. ఈ పర్యటన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతుంది. అక్కడ పరిమిత ఓవర్ల సిరీస్ ఆడాల్సి ఉంది.