Nayanatara -Vignesh: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీ కపుల్ గా గుర్తింపు పొందిన వారిలో నయనతార(Nayanatara) విగ్నేష్ శివన్ (Vignesh Shivan)దంపతులు ఒకరు. నయనతార సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓవెలుగు వెలుగుతున్నారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. ఇక నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు కవల సంతానం అనే సంగతి తెలిసిందే. ఇక వీరి వ్యక్తిగత విషయం పక్కనపెట్టి వృత్తిపరమైన విషయానికి వస్తే.. నయనతార ఇటీవల కాలంలో నిర్మాణ సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
లైంగిక వేధింపులు..
ఈ క్రమంలోనే తన నిర్మాణ సంస్థలు” లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ”(Love Insurance Kompany) అనే సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా విషయంలో పెద్ద ఎత్తున ఈ దంపతులు విమర్శలకు కారణమవుతున్నారు. ఈ సినిమాలో ఒక పాట కోసం ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) ఎంపిక చేయడంతో వీరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో జానీ మాస్టర్ మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కారణంగా అరెస్టయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈయనపై ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఇలా కొద్దిరోజుల పాటు జైలులో ఉన్న జానీ మాస్టర్ ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చి తిరిగి కెరియర్ పై ఫోకస్ పెడుతున్నారు.
నేరస్తులకు ప్రోత్సహింపు…
ఈ క్రమంలోనే పలు సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకున్నారు. అయితే నయనతార విగ్నేష్ నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమాలో ఈయన ఒక సాంగ్ చేయబోతున్నారు అంటూ డైరెక్టర్ విగ్నేష్ జానీ మాస్టర్ తో కలిసి దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెటిజన్స్ స్పందిస్తూ… మైనర్ పై లైంగిక వేధింపులకు గురి చేసిన ఇలాంటి వారిపై అనర్హత వేటు వేయకుండా ఎందుకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు అంటూ కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం జానీ మాస్టర్ డాన్స్ టాలెంట్ ని చూసి అవకాశాలు ఇస్తున్నారు ఇందులో తప్పేముంది అంటూ సమర్థిస్తున్నారు.
Jani is out on conditional bail involving a minor’s sexual assault.
We as a people seem to love ‘talented’ offenders and will keep promoting them and keeping them in positions of power which the offenders use to harangue the women more – “See nothing will happen to me.”
It is… pic.twitter.com/irXOqZp824
— Chinmayi Sripaada (@Chinmayi) July 2, 2025
ఇక ఈ వివాదంపై సింగర్ చిన్మయి(Chinmayi) కూడా స్పందించారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో బెయిల్‌తో బయకు వచ్చిన ప్రతిభావంతులైన నేరస్థులను ప్రోత్సహిస్తున్నారు అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సింగర్ చిన్మయి చేసిన ఈ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. అయితే సింగర్ చిన్మయి ఇలాంటి విషయాలలో పెద్ద ఎత్తున తన గలం వినిపిస్తూ విమర్శలకు గురి అవుతూ ఉంటారు. మరోసారి జానీ మాస్టర్ పై చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి . దీంతో చిన్మయిపై కూడా పలువురు విమర్శలు కురిపిస్తున్నారు.మరి జానీ మాస్టర్ విషయంలో వస్తున్న విమర్శలపై ఇప్పటివరకు జానీ మాస్టర్ , నయనతార దంపతులు ఎక్కడ స్పందించలేదు.
Also Read: విశ్వంభరలో చిరు సూపర్ హిట్ రీమిక్స్ సాంగ్.. బాస్ కోసం పాటలే దొరకలేదా?