BigTV English

HBD Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే స్పెషల్ స్టోరీ మీకోసం!

HBD Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ బర్త్ డే స్పెషల్ స్టోరీ మీకోసం!

HBD Sonu Sood:మనుషుల్లో దేవుళ్ళు ఉంటారు అంటూ ఉంటారు. ఆపద సమయంలో ఎవరైతే చేయూతనిస్తారో వాళ్లు దేవుళ్ళలాగే కనిపిస్తారు. ఇక అలాంటి వారికి ఈ హీరో నిలువెత్తు నిదర్శనం అనుకోవచ్చు. నటుడిగా.. విలన్ గా..ఇండస్ట్రీలో చెరిగిపోని ముద్ర వేసుకున్న ఈయన ఎవరో కాదు సోనూ సూద్ (Sonu Sood).. నటుడిగానే కాకుండా ఆపద సమయంలో నేనున్నానంటూ చేయూత నిచ్చే సోనూసూద్ బర్త్ డే కావడంతో ఆయనకు సంబంధించి ఈరోజు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మరి ఇంతకీ సోనూ సూద్ కి సంబంధించిన జీవిత విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


మోడలింగ్ రంగంతో తొలి అడుగు..

పంజాబ్ లోని మోగా అనే పట్టణంలో శక్తి సాగర్ సూద్(Shakti Sagar Sood), సరోజ్ సూద్ (Saroj Sood)లకు సోనూసూద్ 1973 జూలై 30న జన్మించాడు. అలా ఇవాల్టితో సోనూసూద్ జన్మించి 52 సంవత్సరాలు అవుతున్న వేళ.. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈయన నాగపూర్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా మోడలింగ్లో రాణిస్తున్న తరుణంలోనే సినిమాల్లోకి వెళ్లాలనే ఇంట్రెస్ట్ కలిగింది. అలా దాదాపు నెల రోజులు యాక్టింగ్ లో కోచింగ్ తీసుకొని. సినిమా అవకాశాల కోసం ట్రై చేశారు. ఇక సోనూసూద్ కి మొట్టమొదటి అవకాశం వచ్చింది తమిళ సినిమాలో.. ‘కుళ్లళలగర్’ అనే సినిమాలో పూజారి పాత్రలో నటించి సోనూసూద్ సినీ రంగ ప్రవేశం చేశారు. అలా తమిళంలో రెండు మూడు సినిమాలు చేసి బాలీవుడ్ లో కూడా చేశారు.


సూపర్ సినిమాతో తెలుగు సినీరంగ ప్రవేశం..

ఇక సోనూసూద్ కి ఇతర ఇండస్ట్రీలలో కంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ గుర్తింపు లభించింది. నాగార్జున (Nagarjuna) నటించిన సూపర్ (Super) సినిమాలో హైటెక్ దొంగ పాత్రలో కనిపించిన సోనూ సూద్ ‘అరుంధతి’ మూవీ (Arundhati Movie)లో పశుపతి పాత్ర పోషించి ఇండస్ట్రీలో స్టార్ అయిపోయారు. ఈ సినిమాలో సోనూ సూద్ యాక్టింగ్ కి చాలామంది ఫిదా అయ్యారు. ‘అమ్మా బొమ్మాలి’ అంటూ ఈయన చెప్పే డైలాగ్ ఇప్పటికీ ఫేమసే.. అలా ‘అరుంధతి’ సినిమా తర్వాత సోనూ సూద్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక ఎక్కువ సినిమాల్లో సోనూసూద్ విలన్ గానే నటించారు.అయితే తెరమీద విలన్ గా నటించినప్పటికి నిజ జీవితంలో మాత్రం సోనూసూద్ నిజమైన హీరో అని చెప్పుకోవచ్చు. దానికి కారణం కరోనా(Karona) కష్టకాలంలో ఈయన ఎంతోమందికి చేసిన సహాయమే.. కరోనా సమయంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు.ఉపాధి కోల్పోయిన వాళ్లకి ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా పని కూడా అందించారు. లాక్డౌన్ సమయంలో చాలామంది కార్మికులు సొంత ఊర్లకు వెళ్లడానికి రవాణా లేకపోవడంతో సోనూ సూద్ ప్రత్యేక రైళ్లను, బస్సు సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

కరోనా టైంలో రియల్ హీరోగా గుర్తింపు..

అలాగే కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందని తెలుసుకొని చాలా హాస్పిటల్స్ కు ఆక్సిజన్ సిలిండర్లను సొంత డబ్బులతో ఇచ్చారు. అంతేకాదు కరోనా సమయంలో స్కూల్లు మూతపడడంతో ఆన్లైన్ క్లాసులు వినలేని దాదాపు 300 మంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఇలా ఎంతోమందికి చేయూత నిచ్చి నేనున్నాను అంటూ అండదండగా నిలిచిన సోనూ సూద్ బర్త్డే కావడంతో ఆయనకు సోషల్ మీడియా వ్యాప్తంగా ఎంతో మంది నెటిజన్స్, ఆయన అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఇక సోనూ సూద్ వ్యక్తిగత విషయానికి వస్తే..ఆయన మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన సోనాలి (Sonali) ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.

ALSO READ:Anasuya: భర్తతో విభేదాలు.. నేను అలా ఉండడం మా ఆయనకు నచ్చడం లేదు -అనసూయ

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×