Anasuya:జబర్దస్త్ యాంకర్ గా దాదాపు తొమ్మిదేళ్లపాటు కొనసాగి తెలుగు ప్రజల హృదయాలను దోచుకుంది అనసూయ (Anasuya ). అందం , అభినయంతోనే కాదు అద్భుతమైన వాక్చాతుర్యంతో కూడా అందరిని కట్టిపడేసింది. ఒకవైపు జబర్దస్త్ కార్యక్రమంలో యాంకర్ గా చేస్తూనే.. మరొకవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ తన మార్కు చూపించింది. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించిన ఈమె.. ఆ తర్వాత పలు పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటించింది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆడియన్స్ ను అబ్బురపరిచింది.
నా భర్త కూడా అందరి మగవాళ్ళలాగే – అనసూయ
ఏ విషయాన్ని అయినా సరే నిర్మొహమాటంగా మాట్లాడగలిగే అతి తక్కువ మందిలో అనసూయ ప్రథమ స్థానంలో ఉంటారు. ఇక అందులో భాగంగానే తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా ఓపెన్ గా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. అనసూయ మాట్లాడుతూ.. “మా ఆయన పర్ఫెక్ట్ అని అందరూ అనుకుంటారు. కానీ అందరి మగవాళ్ళలాగే మా ఆయన కూడా.మా ఇద్దరి మధ్య కూడా అప్పుడప్పుడు ప్రత్యేకించి కొన్ని సందర్భాలలో గొడవలు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా నేను కొంతమందిని వెళ్లి కలవడం, కొంతమందితో సినిమాలు చేయడం మా ఆయనకు నచ్చదు. ఆ కారణం వల్లే మా ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడుతూ ఉంటాయి.
నేను వారితో కలవడం మా ఆయనకు నచ్చదు – అనసూయ
ముఖ్యంగా నేను హీరోలతో లేదా పెద్ద పెద్ద స్టార్ లను కలవడం, వారితో పనిచేయడం ఇలాంటివి చూసి ఆయన తట్టుకోరు. ముఖ్యంగా అబ్బాయిల మనస్తత్వమే అది కదా.. నన్ను ఫ్లర్ట్ చేయడం కావచ్చు.. కాంప్లిమెంట్ ఇవ్వడం కావచ్చు.. ఇలాంటివి కూడా ఆయన తీసుకోలేరు. సాధారణంగా చూసే జనాలు మాత్రం అనసూయ భర్త ఆమెకు ఫ్రీడమ్ ఇచ్చాడు.. అన్ని విషయాలలో తోడుంటాడు.. వాడొక చేతకాని వాడు అని కామెంట్లు చేస్తూ ఉంటారు.. ఇక్కడ నాకు ఒక ప్లస్ పాయింట్ ఏమంటే.. మా ఆయనకి తెలుగు రాదు.. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు కూడా ఆయన పట్టించుకోడు. అంటూ తన భర్త గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది అనసూయ. మొత్తానికి అయితే అనసూయ కూడా అందరి అమ్మాయిలు లాగే ఇబ్బందులు పడుతోందని, కానీ వాటిని తెలివిగా చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అనసూయకి కూడా అసూయ ఎక్కువే..
అలాగే తన గురించి కూడా ఆమె మాట్లాడుతూ.. నాకు కూడా అసూయ ఉంటుంది. కానీ అసూయ అనేది మా ఆయన దగ్గర మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడ ఉండదు. నేను మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్ ని. ఆయన కూడా అలాగే ఫీల్ అవుతారు. ముఖ్యంగా మా ఆయనతో ఉన్నట్టు నేను వేరే వాళ్ళతో ఉండలేను కదా.. కష్టమైనా.. నష్టమైనా.. సంతోషమైనా.. ఇష్టమైనా.. అన్ని మా ఆయనతోనే అంటూ తన భర్తపై ప్రేమ ఒలకబోసింది అనసూయ.
విడాకుల వల్ల విలువలు తగ్గిపోతున్నాయి..
అలాగే విడాకులపై స్పందిస్తూ.. అన్న, అమ్మ, అక్కతో విడాకులు ఉండవు. కేవలం భార్యతోనే విడాకులు ఉంటాయి. పెళ్లి అనేదానికి మన భారతీయ సాంప్రదాయంలో ఇచ్చే అంత గౌరవం మరెక్కడ ఇవ్వరూ .. అయితే ఈ మధ్య చాలామంది విడాకుల పేరిట విలువలను తగ్గించుకుంటున్నారు.. బంధం నిలబడాలి అంటే నమ్మకం ఉండాలి.. అంతకుమించి సర్దుకుపోయే గుణం ఉండాలి.. ఈ జనరేషన్ వారికి అంత ఓపిక అయితే అసలు లేదు.. అందుకే నాటి జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పటి జనరేషన్ వారు ఎక్కువగా విడాకులు తీసుకుంటూ విలువలు కోల్పోతున్నారు అంటూ అనసూయ తెలిపింది.
ALSO READ :Betting App Case: ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్!