BigTV English

Rapido Ride: లైవ్ లో రాపిడో బైక్ యాక్సిడెంట్.. నెట్టింట వీడియో వైరల్!

Rapido Ride:  లైవ్ లో రాపిడో బైక్ యాక్సిడెంట్.. నెట్టింట వీడియో వైరల్!

 Rapido Accident: ఈ రోజుల్లో చాలా మంది రాపిడో సేవలను వినియోగించుకుంటున్నారు. నగరాల నుంచి పట్టణాల వరకు రాపిడో సేవలు అందిస్తోంది. రాపిడో ద్వారా ప్రయాణీకులు తక్కువ కాస్ట్ తో ఈజీగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ యువతి రాపిడో బైక్ మీద జర్నీ చేస్తూ ప్రమాదానికి గురయ్యింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. చివరకు రాపిడో సంస్థ కూడా రెస్పాండ్ అయ్యింది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఇన్‌ స్టాగ్రామ్ యూజర్ ప్రియాంక తాజాగా రాపిడో రైడ్ బుక్ చేసుకుంది. బైక్ మీద ప్రయాణం చేస్తుండగా ఎందుకు ఆమెకు కాస్త ఆందోళన కలిగింది. సదరు బైక్ డ్రైవర్ సరిగా నడపడం లేదని భావించింది. వెంటనే తన ఫోన్ లో బైక్ రైడ్ ను రికార్డు చేయడం మొదలుపెట్టింది. కొద్ది దూరం వెళ్లగానే బైక్ కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కాకపోయినా, బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ కలిగింది. “నా లైఫ్ లో ఫస్ట్ టైమ్ అన్ సేఫ్ గా భావించాను’ అంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసింది.  ప్రస్తుతం ఈ వీడియో 1.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.


ప్రియాంక ఏం చెప్పిందంటే?

ఇక ఈ వీడియోలో సదరు యువతి రాపిడో రైడింగ్ అనుభవాన్ని వివరించింది. “రాపిడో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్న తీరుతో నేను తొలిసారి అన్ సేఫ్ గా ఫీలయ్యాను. బైక్ ఎక్కే ముందు నేను తనను హెల్మెట్ ఇవ్వమని అడిగాను. కానీ, తను లేదని చెప్పాడు.  సరే, అని అలాగే ఎక్కాను. రోడ్డు మీద అతడి డ్రైవింగ్ కూడా చాలా ర్యాష్ గా ఉంది. నాలో భయం కలిగింది. అందుకే, నేను ఈ రైడింగ్ ను ఫోన్ లో రికార్డు చేయడం మొదలుపెట్టాను. చివరకు నేను అనుకున్నదే అయ్యింది. తను నన్ను బైక్ మీది నుంచి కింద పడేశాడు. నేను అక్కడే దిగి అతడికి డబ్బులు పే చేసి ఆఫీస్ కు వెళ్లిపోయాను. సంతోషకరమైన విషయం ఏంటంటే? నాకు ఎలాంటి గాయాలు కాలేదు. రాపిడో బాధ్యతాయుతమైన వ్యక్తులను నియమించుకోవాలి. ఇతరుల ప్రాణాలను బలి తీసుకునే నిర్లక్ష్య పూరిత వ్యక్తులను దూరం పెట్టాలి” అని ప్రియాంక వివరించింది.

 స్పందించిన రాపిడో సంస్థ

అటు ఈ ఘటపై రాపిడో సంస్థ స్పందించింది. “మీరు బాగానే ఉన్నారని చెప్పినందుకు సంతోషంగా ఉంది. మీ అభ్యర్థన మేరకు, మేము బైక్ కెప్టెన్‌ పై ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అయితే, భవిష్యత్ రైడ్‌ లలో మీరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటే.. మమ్మల్ని సంప్రదించండి. మేము మీకు తప్పకుండా సాయం చేస్తాం” అని తెలిపింది. అటు నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఆమె లేచిన టైమ్ బాగుంది. అందుకే, ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి బయటపడింది” అని కామెంట్స్ చేస్తున్నారు.

Read Also:  రెండు సెకన్లలోనే రెండుగా చీలిపోయిన భూమి.. సీసీటీవీ ఫుటేజ్ వైరల్

Related News

Viral Video: ఈయన దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Viral Video: నడి రోడ్డుపై భర్తను ఉతికి ఆరేసిన భార్య.. పెళ్లికాని ప్రసాదులు మీరు చాలా లక్కీ!

Viral News: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!

Hyderabad Rains: వానల్లో జనాలకు సాయం.. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్‌ పై హైదరాబాదీలు ప్రశంసలు!

Chimpanzee: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Big Stories

×