Bihar Crime: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో భర్తను చంపేస్తున్నారు భార్యలు. కారణాలు ఏమైనా కావచ్చు.. భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకుంటే కొంతైనా సమస్యలు సద్దు మణుగుతాయి. తాజాగా భర్తని చింపేసిన భార్య, ప్రియుడితో ఏకాంతంలో పాల్గొంది. సంచలనం రేపిన ఈ ఘటన బీహార్‌లో వెలుగుచూసింది.
భార్యలు.. భర్తలను చంపే పరంపర కంటిన్యూ అవుతోంది. తాజాగా మరో దిగ్భ్రాంతికరమైన ఘటనలో వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా ఇందుకు వేదికైంది. 30 ఏళ్ల సోనుకుమార్ ఐదేళ్ల కిందట స్మితా దేవిని పెద్దల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. సోను ఆటోడ్రైవర్‌గా ఉంటున్నాడు. మొదట్లో ఈ దంపతుల మధ్య చెప్పలేని ప్రేమ ఉండేది. రానురాను తగ్గిపోయింది.
అయితే స్మిత మాత్రం ఇంట్లో ఉండాలని కోరుకునేది, ఆ విషయంలో భర్తతో గొడవపడేది. ఇదే క్రమంలో స్మితా మనసు డైవర్ట్ అయ్యింది. సోను అన్నయ్య పిల్లలకు హోం ట్యూషన్ చెప్పడానికి హరిఓం కుమార్ అనే వ్యక్తి వచ్చేవాడు. అతడితో క్లోజ్ అయ్యింది స్మిత. అఫ్‌కోర్సు.. ఆ అబ్బాయి కాస్త అందంగా ఉంటాడనుకోంది. అది వేరే విషయం.
ఈ క్రమంలో సోను-స్మిత మధ్య రిలేషన్ షిప్ దూరకావడం మొదలైంది. ఆ తర్వాత గొడవలు జరిగేవి. చివరకు భార్యభర్తల గొడవలు పంచాయితీ వరకు వెళ్లింది. చివరకు పెద్దలు వీరి మధ్య రాజీ కుదిర్చారు. తొలుత మొదట్లో బాగానే ఉండేది. ట్యూటర్ హరిఓం కుమార్ పిల్లలకు చదువు చెప్పడానికి సోను ఇంటికి రావడం మొదలైంది. ఆ తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి.
ALSO READ: ప్రియుడ్ని కిడ్నాప్ చేసిన ప్రియురాలు, 8 రోజులపాటు ఏం చేసిందంటే?
ఒకరోజు సాయంత్రం.. సోను ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. ఆ సమయంలో భార్య స్మిత.. ట్యూషన్ టీచర్‌తో ఏకాంతంలో నిమగ్నమైంది. మళ్లీ ఈ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు ట్యూటర్ హరిఓంను ఇంటికి రావద్దని హెచ్చరించాడు సోను. కొంతకాలం హరిఓం రావడం మానేశాడు. చివరకు సోను అన్నయ్య తన పిల్లలకు ట్యూషన్ చెప్పమని హరిఓంను పిలిచాడు.
తిరిగి స్మిత.. ట్యూటర్‌తో మరింత డీప్‌గా వెళ్లింది. చివరకు అనుమానాస్పద స్థితిలో ఆటోడ్రైవర్ సోను మృతి చెందాడు. అతని ఇంట్లో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సోను శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. స్మితను అదుపులోకి తీసుకుని విచారించారు.
దీంతో అసలు విషయం బయటపడింది. స్మిత, ఆమె ప్రియుడు హరిఓం కలిసి సోను హత్య చేసినట్టు అంగీకరించింది. అంతేకాదు హత్య తర్వాత ప్రియుడితో ఏకాంతంగా కలిసినట్టు చెప్పడంతో పోలీసులకు షాకయ్యారు. స్మితను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హరిఓం కోసం గాలింపు మొదలుపెట్టారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత హత్యా, ఆత్మహత్యా అనేది తేలనుంది.