BigTV English
Advertisement

Beauty with Neem: గుప్పెడు వేపాకులు చాలు మీ చర్మం మెరిసిపోయేలా చేస్తాయి

Beauty with Neem: గుప్పెడు వేపాకులు చాలు మీ చర్మం మెరిసిపోయేలా చేస్తాయి

క్రీములు, పౌడర్లు రాసుకుంటే వచ్చే అందం కన్నా సహజ సిద్ధంగా వచ్చే చర్మపు మెరుపే ఎక్కువ కాలం సజీవంగా ఉంటుంది. ఇందుకోసం ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలను అందించింది. చర్మాన్ని అందంగా మార్చేందుకు వేప ఎంతగానో ఉపయోగపడుతుంది. వేపలో వైద్యపు లక్షణాలు కూడా ఎక్కువ. ఆయుర్వేదంలో సహజ మూలికగానే చెప్పుకుంటారు. వేప వల్ల మొటిమల నుంచి దురదల వరకు ఎన్నో తగ్గుతాయి. అయితే గుప్పెడు వేపాకులతో మీ చర్మ సమస్యలను ఎలా తీర్చుకోవాలో తెలుసుకోండి.


వేప ఉపయోగాలు
వేప ఆకులలో యాంటీ బ్యాక్టీరియల్ స్వభావం అధికం. కాబట్టి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. చర్మ కణాల నుండి మరణాలను తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి తగ్గేలా చేస్తుంది. అలాగే చర్మం పై పడిన ముడతలు, గీతలను కూడా తగ్గించే యాంటీ ఏజెంట్ లక్షణాలు దీనికి ఉన్నాయి. చర్మపు రంగును కూడా ప్రకాశవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. చర్మంపై ఉన్న మచ్చలు, మొటిమలు వంటి వాటిని తగ్గించడంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది.

వేపతో ఇలా చేయండి
వేప ఆకులను మిక్సీలో వేసి ముద్దలా చేసుకోండి. దాన్ని ముఖానికి పట్టించి పావుగంటసేపు వదిలేయండి. వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి ఇలా చేసినా చాలు.. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని తుడిచేయండి. తరచూ ఇలా చేయడం వల్ల మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.


వేపాకుల పొడితో
వేప ఆకులను ఎండబెట్టి పొడి చేసి కూడా దాచుకోవచ్చు. ఇది ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల వేప పొడిని తీసుకుని అందులో కొంచెం నీరు కలిపి మందపాటి పేస్టులా చేసుకోవాలి. అందులో రెండు చుక్కల రోజ్ వాటర్ కూడా వేయాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసి ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిమ్మకాయ వేపాకుల మిశ్రమం కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలు ఆమ్ల లక్షణాలు ఉంటాయి. ముఖంపై పిగ్మెంటేషన్ తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వేపాకుల పేస్టులో, కొన్ని చుక్కల రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోండి. అందులోనే రెండు చుక్కల నిమ్మ రసాన్ని కూడా వేయండి. ఆ తర్వాత దాన్ని ముఖానికి పట్టించి కాసేపు వదిలేయండి. మచ్చలేని చర్మం మీకు సొంతమవుతుంది.

పొడి చర్మంతో బాధపడేవారు వేప ఆకులను మరిగించి పేస్టులా తయారు చేసుకోవాలి. వేప పేస్టుని పసుపు పొడి, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత పరిశుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పొడి చర్మం ఉన్నవారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

జిడ్డు చర్మం ఉన్నవారికి తరచూ మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు టీ స్పూన్ల వేపాకుల పేస్టులో రోజ్ వాటర్, నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి పట్టించి చేతితోనే మసాజ్ చేయండి. కాసేపటి తర్వాత శుభ్రంగా కడిగి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోండి. ఇలా చేస్తే మీకు ఎన్నో రకాల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×