Suriya Karuppu Teaser :ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు సూర్య (Suriya). ‘సూర్య 45’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభమైన ఈ చిత్రానికి ‘కరుప్పు’ అని టైటిల్ పెట్టారు. సూర్య తన మాగ్నమోపస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji) పుట్టినరోజు సందర్భంగా జూన్ 20వ తేదీన ఈ సినిమా టైటిల్ లుక్ ను రివీల్ చేశారు. అటు టైటిల్ పోస్టర్ కూడా చాలా పవర్ఫుల్గా ఆకట్టుకుంది. అందులో ఒక చేతిలో సూర్య కత్తి పట్టుకొని ఉండగా.. అతని వెనుక ఒక దేవత ఉన్నట్లుగా ఫెరోషియస్ అవతారంలో చూపించారు. ఇక ఈ సినిమా పూర్తిగా యాక్షన్ తో నిండి ఉంటుందని, వైల్డ్ పాత్రలో సూర్య కనిపిస్తున్నాడని స్పష్టంగా పోస్టర్ ద్వారా తెలియజేశారు.
కరుప్పు టీజర్ రిలీజ్..
రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ సూర్యతో త్రిష కృష్ణన్ (Trisha Krishnan) జతకట్టింది. సూర్య బర్తడే కావడంతో ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ మాస్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు లాయర్ పాత్రలో నటిస్తూనే.. మరొకవైపు మాస్ పాత్రలో ఇరగదీసేశారు. యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు అని చెప్పవచ్చు. ఓవరాల్గా సూర్యకి ఈ సినిమా ఖచ్చితంగా మాస్ ఇమేజ్ తెచ్చిపెడుతుందని, బ్లాక్ బాస్టర్ హిట్టు కొడుతుందని అభిమానులు అప్పుడే కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే టీజర్ మాత్రం అసలైన బర్తడే ట్రీట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు సూర్య ఫ్యాన్స్.
కుమ్మిపడేసిన సూర్య.. టీజర్ ఎలా ఉందంటే?
కరుప్పు టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. టీజర్ ప్రారంభం అవ్వగానే అమ్మవారి జాతరతో ప్రారంభించారు. ఒకవైపు జాతర జరుగుతుండగానే మరొకవైపు..”కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకొని మిరపకాయలు దంచితే.. రుద్రుడై దిగి వచ్చే దేవుడు” అంటూ సూర్య వాయిస్ ఓవర్ తోనే టీజర్ ను ప్రారంభించారు . తర్వాత సూర్య చెప్పే ఒక్కొక్క డైలాగ్స్ థియేటర్లలో ఈలలు చప్పట్లతో దద్దరిల్లాల్సిందే. “నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరుంది”.. “బేబీ ఇది డాడీస్ హోమ్”.. “ఇది నా టైం” అంటూ సూర్య చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో సూర్య లాయర్ పాత్రలో నటిస్తూనే.. మరొకవైపు మాస్ యాంగిల్ లో కుమ్మిపడేశారు. ఇక్కడ సూర్య యాక్షన్ పర్ఫామెన్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. కచ్చితంగా ఈ సినిమా సూర్య స్థాయిని మరింత పెంచుతుంది అని చెబుతున్నారు. ఏది ఏమైనా సూర్య బర్తడే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు.
ALSO READ:Ravi Kishan: రేసుగుర్రం విలన్ కూతురో స్టార్ హీరోయిన్.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!