Boiled Eggs Vs Paneer: ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉంటారు. ఉదయం మనం తీసుకునే ఆహారం రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నిత్యం శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు ముఖ్యమైనవి. మంచి ఆరోగ్యం కోసం ప్రోటీన్ చాలా అవసరం. కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు, శరీరంలోని వివిధ జీవక్రియలకు ప్రోటీన్ కీలకం. ఇదిలా ఉంటే.. ప్రోటీన్ కోసం చాలామంది ఎంచుకునే రెండు సాధారణ ఆహార పదార్థాలు గుడ్లు, పనీర్. ఈ రెండింటిలో ఉదయం పూట తినడం మంచిదే.. కానీ ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పోషక విలువలు:
గుడ్లు, పనీర్ రెండింటిలోనూ ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. కానీ వాటి పోషక విలువలు కాస్త భిన్నంగా ఉంటాయి.
ఒక ఉడికించిన గుడ్డులో (సుమారు 50 గ్రాములు):
ప్రోటీన్: సుమారు 6 గ్రాములు
కేలరీలు: సుమారు 70-80 కేలరీలు
కొవ్వు: సుమారు 5 గ్రాములు (దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి)
ఇతర పోషకాలు: విటమిన్ బి12, విటమిన్ డి, కోలిన్, సెలీనియం వంటివి అధికంగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ.. ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయదు.
100 గ్రాముల పనీర్‌లో:
ప్రోటీన్: సుమారు 18-20 గ్రాములు.
కేలరీలు: సుమారు 265 కేలరీలు.
కొవ్వు: సుమారు 20 గ్రాములు.
ఇతర పోషకాలు: కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ బి12 అధికంగా ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుడ్లు పూర్తి ప్రోటీన్‌కు మూలం. అంటే.. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్ని తొమ్మిది రకాల ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు ఉంటాయి.
విటమిన్ డి ఉన్న అతి కొద్ది ఆహార పదార్థాలలో గుడ్లు ఒకటి. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యం.
గుడ్లలోని కోలిన్ మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి సహాయ పడుతుంది.
గుడ్లు జీర్ణమవడం సులభం అంతే కాకుండా ఇవి తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్‌ను అందిస్తాయి.
పనీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
శాకాహారులకు అవసరం అయిన ప్రొటీన్ పన్నీర్‌లో ఉంటుంది.
ఇందులో కాల్షియం ,ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
పనీర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా బాగా సహాయ పడుతుంది.
ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.
Also Read: గురక పెట్టి నిద్రపోతున్నారా? అయితే మీరు ప్రమాదకరమైన వ్యాధి బారిన పడ్డట్లే !
ఏది ఉత్తమం ?
ఏది ఉత్తమమైన ఎంపిక అనేది మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి లేదా తక్కువ కేలరీలు కావాలనుకునేవారికి గుడ్లు బెస్ట్. ఇవి తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్‌ను అందిస్తాయి.
గుడ్ల పోషక విలువలు పనీర్ కంటే భిన్నంగా ఉంటాయి. పనీర్ ఎక్కువ కొవ్వు, కేలరీలు కలిగి ఉంటుంది.
శాకాహారులకు: పనీర్ ఉత్తమమైన ప్రోటీన్ మూలం. గుడ్లు తినని వారికి పనీర్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.
కండరాల నిర్మాణానికి: రెండు సమానంగా ఉపయోగపడతాయి. కానీ పనీర్‌లో ప్రోటీన్, కేలరీలు అధికంగా ఉంటాయి. ఫలితంగా ఇది కండరాల వృద్ధికి తోడ్పడుతుంది.