Actress Hema: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. త్వరలోనే మంచు లక్ష్మి నటించిన దక్ష సినిమా(Daksha Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే జర్నలిస్ట్ మూర్తి (Murthy)తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మికి జర్నలిస్టు నుంచి ఊహించని ప్రశ్నలు ఎదురవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మూర్తి మంచు లక్ష్మి వయసు, వేసుకునే బట్టల గురించి ప్రశ్నించడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఇక ఈ వివాదం పై పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు తాజాగా సినీనటి హేమ(Hema) కూడా ఈ వివాదం పై స్పందిస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె పూర్తిస్థాయిలో మద్దతు మంచు లక్ష్మికి తెలియజేశారు. మీడియా వారు సెలబ్రిటీల గురించి ఎలా మాట్లాడిన తప్పులేదు కానీ సెలబ్రిటీలు ఒక చిన్నమాట అంటే క్షమాపణలు చెప్పే వరకు వదలరని తెలిపారు.
క్షమాపణలు చెప్పిన సుమ..
గతంలో సుమ కనకాల(Suma Kanakala) మీడియా వారు టిఫిన్లు భోజనం లాగా చేస్తున్నారు అంటూ మాట్లాడిన సరదా మాటలను కూడా సీరియస్ గా తీసుకొని తనతో క్షమాపణలు చెప్పించుకున్నారు. వేణు స్వామి సమంత నాగచైతన్య పెళ్లి గురించి మాట్లాడిన మాటల పట్ల కేసులు వేసి క్షమాపణలు కోరారు. నా విషయంలో కూడా మీడియా వారి ప్రవర్తన ఇలాగే ఉందని ఈమె ఆవేదన చెందారు. అయితే సినిమా సెలబ్రిటీల గురించి మీడియా వారు ఈ విధంగా వ్యవహరిస్తున్న మా అసోసియేషన్ ఇప్పటివరకు స్పందించకపోవడం ఏంటి అంటూ ఈమె ప్రశ్నించారు.
?igsh=MXI4ajZmNnR0MnRkZw==
మంచు విష్ణు(Manchu Vishnu) మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. మా ప్రెసిడెంట్ సోదరికే ఈరోజు ఇలాంటి అవమానం జరిగితే ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు? అంటూ హేమ ఈ సందర్భంగా మా అసోసియేషన్ ని కూడా ప్రశ్నించారు. నా విషయంలో “మా” నిజా నిజాలు తెలియకుండా వెంటనే నన్ను సస్పెన్షన్ చేశారు. మరి ఇప్పుడు ఎందుకని మీ సోదరికే ఇలాంటి అవమానం జరిగితే మీడియా వారిని ప్రశ్నించలేదు? చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈరోజు మీ సిస్టర్ కి జరిగిన విధంగానే రేపు మరొక ఆర్టిస్ట్ కి కూడా జరుగుతుంది. వెంటనే విష్ణు బాబు ఈ విషయంపై స్పందిస్తూ సరైన చర్యలు తీసుకోవాలి అంటూ ఈ సందర్భంగా హేమ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు కూడా హేమకు మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఇప్పుడైనా ఈ విషయంపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!