SL Vs BAN : ఆసియా కప్ 2025 లో భాగంగా.. ఇవాళ సూపర్ 4 తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక గా ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే గ్రూపు దశలో గ్రూపు బీలో శ్రీలంక టాప్ ప్లేస్ లో నిలిచింది. బంగ్లాదేశ్ సెకండ్ ప్లేస్ లో కొనసాగింది. రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. గత రికార్డులు పరిశీలిస్తే.. బంగ్లాదేశ్ కంటే శ్రీలంక చాలా బలంగా కనిపిస్తోంది. నేతృత్వంలో శ్రీలంక అద్భుతంగా ముందుకు వెళ్తోంది. అటాకింగ్ బౌలింగ్ అలాగే బ్యాటింగ్లో దుమ్ములేపుతోంది శ్రీలంక. అయితే ఈ టోర్నమెంట్ T 20 ఫార్మాట్ లో జరుగుతున్న నేపథ్యంలో… చివరికి క్షణంలో ఏ జట్టు అయినా విజయం సాధించవచ్చు.
Also Read : Smriti Mandana : ఫాస్టెస్ట్ సెంచరీ.. రికార్డు సృష్టించిన మంధాన
ఇక రెండు జట్ల బలబలాలను పరిశీలించినట్టయితే శ్రీలంక ఫేవరేట్ గా బరిలోకి దిగబోతుంది. ఈ టోర్నీ లీగ్ లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో శ్రీలంక జట్టు ఘన విజయం సాధించింది. అయితే మరోవైపు బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ లో ఓడిపోయి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. లీగ్ మ్యాచ్ ల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లాదేశ్ భావిస్తుంటే.. అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని శ్రీలంక ఎదురుచూస్తోంది. ఇక రేపు సూపర్ సండే మ్యాచ్ ఉంది. ఇందులో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగానే మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 23వ తేదీన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య అబుదాబిలో మ్యాచ్ ఉంటుంది. సెప్టెంబర్ 24వ తేదీన టీమ్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య దుబాయ్ లో బిగ్ ఫైట్ ఉంటుంది.సూపర్ 4 కి టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ అర్హత సాధిస్తే.. ఫైనల్ కి ఏ రెండు జట్లు అర్హత సాధిస్తాయనే అంచెనాలు వేస్తున్నారు. ఎక్కువగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శ్రీలంక వర్సెస్ టీమిండియా లేదా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్యనే ఫైనల్ జరుగనున్నట్టు అంచెనా వేస్తున్నారు. ఫైనల్ శ్రీలంక వర్సెస్ ఇండియా జరగాలని కొందరూ.. పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా జరగాలని మరికొందరూ కోరుకుంటున్నారు.
Also Read : Suryakumar Yadav : వాడి వల్లే ఒమన్ పై బ్యాటింగ్ చేయలేకపోయాను..సీక్రెట్ బయటపెట్టిన సూర్య కుమార్
శ్రీలంక జట్టు :
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక(c), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీర, నువాన్ తుషార
బంగ్లాదేశ్ జట్టు :
సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్(w/c), తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రెహమాన్.