BigTV English

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

Mohanlal: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటుడు మోహన్ లాల్(Mohan Lal) ఒకరు. మలయాళ చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయనకు కేవలం మలయాళ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా నటుడిగా ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న మోహన్ లాల్ అరుదైన పురస్కారానికి ఎంపిక అయ్యారు.


దాదాసాహెబ్ పాల్కే 2023 పురస్కారం..

తాజాగా ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు.. నటుడు మోహన్ లాల్ సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలను గుర్తిస్తూ ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే 2023(Dada saheb Phalke award 2023) అవార్డును ప్రధానం చేయబోతున్నట్లు తెలియజేశారు. ఇలా ఈయనకు ఈ అవార్డును ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మోహన్ లాల్ సినీ ప్రయాణం ప్రస్తుత తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని వెల్లడించారు. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీకి సేవలను అందించారని కొనియాడారు.

71 వ జాతీయ చలనచిత్ర అవార్డు..


మోహన్ లాల్ నటన నైపుణ్యం, ఆయన పట్టుదల, కృషి ఇండస్ట్రీలో తనను గొప్ప నటుడిగా నిలబెట్టిందని పేర్కొన్నారు. ఇలా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించిన మోహన్లాల్ దాదాసాహెబ్ ఫాల్కే 2023 పురస్కారానికి ఎంపిక అయినట్లు ప్రకటించడమే కాకుండా ఈ పురస్కారాన్ని సెప్టెంబర్ 23,2025 న నిర్వహించబోతున్న71 వ జాతీయ చలనచిత్ర అవార్డు(71National Film Awards) ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా అందజేయబోతున్నట్లు తెలియచేశారు. మోహన్ లాల్ ఇలాంటి ఒక గొప్ప పురస్కారానికి ఎంపిక కావడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక నటుడు మోహన్ లాల్ ఈ పురస్కారానికి ఎంపిక కావడంతో తోటి నటీనటులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక మోహన్ లాల్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటించిన జనతా గ్యారేజ్ సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన వరుస తెలుగు సినిమాలలో నటించడమే కాకుండా ఈయన మలయాళంలో నటించిన సినిమాలను కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ సౌత్ సినీ ఇండస్ట్రీలోనే బిజీ హీరోగా కొనసాగుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈయన సుమారు 300 కు పైగా సినిమాలలో నటించారు. ఇదివరకే మోహన్ లాల్ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు కూడా ఎంపిక కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Related News

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Mirai vs Kishkindhapuri: లెక్కలు మారుతున్నాయి… ఈ వీకెండ్ ఏం జరుగుతుందో ?

SDT: సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ.. దిగ్గజాలంతా ఒకే చోట.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీనా.?

Big Stories

×