Smriti Mandana : ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మూడో వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన చెలిరేగి పోయింది. ఈ క్రమంలో ఆమె వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ఉమెన్ క్రికెటర్ గా నిలిచారు. 50 బంతుల్లో 14 ఫోర్లు, 4 సి క్స్ లతో సెంచరీ బాదారు. 413 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాని స్మృతి ముందుకు నడిపిస్తున్నారు. ఇక అంతకు ముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టు వన్డే సిరీస్ కి కైవసం చేసుకోవడం ఖాయం అని తెలుస్తోంది. ఎందుకంటే..? ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 412 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో హేలీ 30, జార్జియా వాల్ 81, ఎల్లీస్ ఫెర్రీ 68, బెత్ మూనీ 138, ఆష్లీ గార్డనర్ 39, తహ్లియా మెక్ గ్రాత్ 14, జార్జియా వేర్‌హామ్ 16, అలనా కింగ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఆస్ట్రేలియా జట్టు 412 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ఆస్ట్రేలియా కి ధీటుగా బదులిస్తోంది.
Also Read : Abhishek Sharma : టీమిండియాలో మరో జయసూర్య.. వీడు కొడితే నరకమే
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డే క్రికెట్ లో మరో రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ గా ఈ ఘనత సాధించింది. కేవలం 50 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఆస్ట్రేలియా తో జరుగుతున్న మూడో వన్డేలో స్మృతి మంధాన 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్ లు చెలరేగిపోయింది. ప్రారంభం నుంచి చాలా దూకుడుగా ఆడిన స్మృతి 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో మహిళల వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా క్రికెటర్ గా రికార్డుల్లో తన పేరును లిఖించుకుంది. ఇక తరువాత కూడా అదే జోరు కొనసాగించిన మంధాన 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు బెత్ మూనీ (57), కరెన్ రోల్టన్ (57) ను అధిగమించింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే..? బెత్ మూనీ ఈ మ్యాచ్ లోనే 57 బంతుల్లో సెంచరీ చేసి రోల్టన్ సరసన నిలిచింది.
కొద్ది సేపటికే వారిద్దరి రికార్డును స్మృతి బ్రేక్ చేయడం విశేషం. ఓవరాల్ గా ఆసీస్ ప్లేయర్ మెగ్ లానింగ్ 45 బంతుల్లో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు.. వరుసగా రెండు వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా స్మృతి మంధాన నిలిచింది. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును కూడా స్మృతి బ్రేక్ చేయడం విశేషం. మొన్న ముల్లాన్ పూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కూడా ఈమె సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 47.5 ఓవర్లలో 412 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మహిళా క్రికెటర్లు పింక్ జెర్సీ ధరించారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమానికి మద్దతుగా నిలిచేందుకు పింక్ జెర్సీ ధరించారు.