E-Paper
Advertisement

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ పై కార్తీక్ ఫ్యాన్స్ ఫైర్.. అసలేమైందంటే?

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ పై కార్తీక్ ఫ్యాన్స్ ఫైర్.. అసలేమైందంటే?
Advertisement

Lokesh Kanagaraj:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మొదటి సినిమా ‘మా నగరం’ చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈయన.. తన రెండవ చిత్రం ‘ఖైదీ’తో ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నారు. ముఖ్యంగా అద్భుతమైన టేకప్ తో ప్రతి సినిమాతో మంచి విజయం అందుకుంటూ దూసుకుపోతున్న ఈయన.. తన ఇమేజ్ కి తగ్గట్టుగా మార్కెట్ ని పెంచుకోవడమే కాకుండా ట్రెండ్ కి తగ్గట్లుగా సినిమాలు తీసి సక్సెస్ సాధిస్తున్నారు.

లోకేష్ కనగరాజ్ పై కూలీ ఎఫెక్ట్..

ముఖ్యంగా మాస్టర్, లియో, విక్రమ్ వంటి సినిమాలతో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ఆ తర్వాత రజనీకాంత్ (Rajinikanth)తో చేసిన కూలీ సినిమా మాత్రం భారీగా బొక్కబోర్ల పడిందనే చెప్పాలి. ముఖ్యంగా రూ.500 కోట్లు కూడా ఈ సినిమా రాబట్టలేక ఎన్నో తిప్పలు పడింది. పైగా ఈ సినిమా రిజల్ట్ లోకేష్ కనగరాజ్ పై భారీ ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. మరోవైపు లోకేష్ కనగరాజ్ కూలీ సినిమా తర్వాత ఖైదీ 2 ఉంటుందని చెప్పుకొచ్చారు. అటు హీరో కార్తీ కూడా ఖైదీ 2 కోసం సిద్ధమవుతున్నానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

లోకేష్ పై మండిపడుతున్న కార్తీ ఫ్యాన్స్..

Advertisement

అయితే ఇప్పుడు కూలీ మూవీ ఎఫెక్ట్ తో కార్తీని వదిలేసి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) తో సినిమా ప్రకటించాడు లోకేష్ కనగరాజ్ . పైగా ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. కూలీ డిజాస్టర్ అయితే నేమి ఖైదీ 2 తో మంచి విజయాన్ని కార్తీకి అందిస్తారని ఎదురుచూసిన కార్తీ అభిమానులకు లోకేష్ పూర్తిస్థాయిలో నిరాశ మిగిల్చారు. దీంతో లోకేష్ పై కార్తీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కార్తీతో సినిమా చేయకుండా ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించడం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై కార్తీక్ , లోకేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక కార్తీ మరొకవైపు తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సర్దార్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సర్దార్ 2ను సెట్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది..

లోకేష్ తదుపరి చిత్రాలు..

ప్రస్తుతం లోకేష్ అల్లు అర్జున్ తో సినిమా ప్రకటించారు. ఈ ఏడాది ఖచ్చితంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. పైగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమా చేస్తున్నారు. హాలీవుడ్ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తుంది. మరి అంతలోపే ఈ సినిమాను ఈ ఏడాదే తీసుకొస్తారని ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అల్లు అర్జున్ ఈ రెండు చిత్రాలతో ఎలా మేనేజ్ చేస్తారో చూడాలని ఆయన అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు.

Advertisement

ALSO READ:AR Rahman: నేను ముస్లిం.. రెహమాన్ పై పెరుగుతున్న నెగిటివిటీ.. ఆఖరికి ఏమన్నారంటే?

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×