E-Paper
Advertisement

Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, మనవళ్లు లోకేష్-కల్యాణ్‌రామ్

Hyderabad: ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు, మనవళ్లు లోకేష్-కల్యాణ్‌రామ్
Advertisement

Hyderabad: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ 30వ వర్థంతి సందర్భంగా ఆయన ఘాటు వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్నారు ఆయన కుటుంబసభ్యులు. సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

ఎన్టీఆర్ వర్ధంతి నేడు.. నివాళులు అర్పించిన కుటుంబసభ్యులు

Advertisement

తన తండ్రికి నివాళులు అర్పించారు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మనవడు లోకేశ్‌తో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, అభిమానులు అక్కడికి వచ్చి నివాళులు అర్పించారు. అలాగే నటుడు కల్యాణ్‌రామ్‌ అక్కడికి వచ్చి తాతకు నివాళులర్పించారు. అంతకుముందు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘాట్‌ను పూలతో తీర్చిదిద్దారు. అంతేకాదు ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవిత విశేషాలతో చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

అటు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. కారణ జన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిదైన నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించారు. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు అని రాసుకొచ్చారు.

Advertisement

ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నివాళి

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడు. నటుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం. అని రాసుకొచ్చారు.

టీడీపీ నేతలు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి మహనీయుడికి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఎన్నేళ్లయినా ప్రజల గుండెల్లో జీవించే ఉంటారన్నారు మోత్కుపల్లి నర్సింహులు. పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని అన్నారు.

ALSO READ: చౌమహల్లా ప్యాలెస్‌లో సంగీత కార్యక్రమం, గవర్నర్, సీఎం రేవంత్ హాజరు

 

 

 

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×