Hero Suriya Team Clarifies on Rumour: సినీ పరిశ్రమకు, రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం ఉంఉటంది. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల్లో స్టార్ హీరోలు రాణించిన పలువురు నటులు రాజకీయాల్లో అడుగుపెట్టి… ముఖ్యమంత్రులుగా గెలిచి ప్రజలకు సేవలు అందించారు. ఆ జాబితాలో సీనియర్ హీరో ఎన్టీఆర్ ముందుంజలో ఉంటారు. ఇక తమిళనాడు విషయానికి వస్తే.. ఎంజీఆర్, జయలలితల పేర్లు ముందుంటాయి. నిజానికి తమిళ సినీ పరిశ్రమకు ఎప్పుడు రాజకీయాల సెగ ఉంటుంది. ఇటీవల కాలంతో అది మరింత ఎక్కువగా ఉంది. కమల్ హాసన్, రజనీకాంత్, దళపతి విజయ్, అజిత్ వంటి అగ్ర హీరోలు రాజకీయాల ఎంట్రీపై ఎప్పుడు వార్తలు వస్తుంటాయి. ఇప్పటికే విజయ్ దళపతి రాజకీయ రంగప్రవేశం చేశారు.
ఆ హీరోలు కన్ఫాం
పార్టీని సైతం రిజిస్టర్ చేసుకుని 2026 ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. మరోవైపు కమల్ హాసన్ కూడా తన పార్టీని ప్రకటించారు. ఇటీవల తన రాజకీయ పార్టీని ప్రకటించి.. పాలిటిక్స్‌లోకి అడుగుపట్టారు. ఇక సూపర్ రజనీకాంత్ విషయం చర్చనీయాంశం ఉంది. ఆయన పాలిటిక్స్‌లోకి రావడం పక్కా అన్నట్టుగా ఉంది. కానీ, ఇంక ఇది ఫైనల్ కాలేదు. ఆయన పొలిటిక్ ఎంట్రీపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మరోవైపు అజిత్ పేరు వినిపించింది. కానీ, తాను సినిమాలు మాత్రమే చేస్తానని, రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని కన్‌ఫాం చేశాడు. అయితే తాజాగా మరో స్టార్ హీరో పేరు వినిపిస్తుంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో హీరో సూర్య ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
వచ్చే ఎన్నికల్లో సూర్య పోటీ?
ప్రస్తుతం హీరోగా సూర్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు అగరం పేరుతో ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులను చదివించి వారిని డాక్టర్లను చేశారు. ఇటీవల వారంత తెరపై వచ్చి సూర్య సేవా కార్యక్రమాలను బయటకు చెప్పారు. అప్పటి హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారంటూ కోలీవుడ్ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన టీం స్పందించింది. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. శ”గత కొన్ని రోజులుగా అన్నన్ సూర్య గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలన్ని అవాస్తవాలు. అందులో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టారు.
Also Read: Naga Vamsi: మాస్ జాతర వాయిదా.. ట్రోలర్స్‌కి కౌంటర్ ఇస్తూ నాగవంశీ ట్వీట్
నటుడిగా సినిమాలు చేయడమే ఆయనకు సంతృప్తినిచ్చింది. ఆయనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. కాబట్టి ఆయన రాజకీయాల్లో వస్తున్నారన్నది అవాస్తవం. ప్రస్తుతం ఆయన సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టారు” అంటూ సూర్య టీం ఈ వార్తలను ఖండించింది. అలాగే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో కూడా సూర్య ఈ వార్తలను ఖండించారు. తన ట్రస్ట్ అగరం ఆధ్వర్యంలో ఓ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, తాను ఎప్పటికీ నటుడిగానే ఉంటానన్నారు. సేవా సేవా దృక్పథంతోనే సామాజిక కార్యక్రమాలు చేస్తున్నానని, ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం సూర్య చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సూర్య ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. ఇటీవల కుటుంబంతో కలిసి ఆయన ముంబైకి షిఫ్ట్ అయ్యారు.
No Politics , Only Cinema
அகில இந்திய சூர்யா தலைமை நற்பணி இயக்கத்தின் அதிகாரப்பூர்வ அறிக்கை #Suriya @SuriyaFansClub pic.twitter.com/RwXfKjOA4e
— Kollywood Cinima (@KollywoodCinima) August 20, 2025