Film industry: సినీ ఇండస్ట్రీలో నటీనటుల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కాస్త కష్టం అని చెప్పాలి. అనూహ్యంగా ఉన్నత స్థాయికి ఎదిగి అనవసర ఖర్చుల వల్ల దీనస్థితికి వెళ్ళిపోతే.. మరికొంతమంది గుడ్డిగా ఇతరులను నమ్మి శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా మోసపోయిన వారు ఉన్నారు. అలా మోసపోయిన ఈమె ఏకంగా ఏడుసార్లు గర్భస్రావం చేయించుకోమని నరకం చూపించారు అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి విజయలక్ష్మి (Vijaya Lakshmi).. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె.. కన్నడలో నాగ మండల, సూర్యవంశ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పుడు సినిమాలతో ఆకట్టుకున్న ఈమె…ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలిచారు అని చెప్పారు. ఇంటర్వ్యూలో విజయలక్ష్మి మాట్లాడుతూ.. “ఐ యాం హ్యాపీ అనే సినిమా ద్వారా నాకు సీమన్ పరిచయమయ్యారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి సంబంధమేమీ లేదు. కానీ నాకు మురుగన్ దేవుడిపై ఎప్పుడూ నమ్మకం ఉండేది. నా సినిమా షూటింగ్ మొదలు పెట్టిన ప్రతిసారి కూడా ఖచ్చితంగా నేను మురుగన్ దర్శనం చేసుకుంటాను. అయితే ఒకసారి సీమన్ నాతో మాట్లాడుతూ.. మీరు ప్రతిసారి మురుగన్ దేవుడిని దర్శిస్తారు కదా.. అయితే ఈసారి అలా కాకుండా మొదట నీతో పాటు షూటింగ్ చేస్తున్న ప్రజల గురించి తెలుసుకోండి. వారితో మాట్లాడండి ఆ తర్వాతే మురుగన్ దర్శనం చేసుకోండి అని అన్నారు.
తప్పని పరిస్థితుల్లో అతనితో మాట్లాడాల్సి వచ్చింది..
దాంతో నేను అతడితో బాగా గొడవపడ్డాను. ఈ కారణంగా అతను ఉంటే నేను సెట్ లో ఉండను అని కూడా ఎన్నోసార్లు చెప్పాను. అయితే ఎలాంటి వారితోనైనా ఏదో ఒక సందర్భంలో అవసరం పడుతుంది అంటారు కదా.. నాకు కూడా నా వ్యక్తిగత కారణాలవల్ల సీమన్ తో మాట్లాడాల్సి వచ్చింది. ఒకసారి నా చెల్లెలి కుటుంబంలో సమస్య ఏర్పడింది. ఆమె భర్త ఆమెను కొట్టి, వేధించేవాడు. దాంతో సీమన్ సహాయం కోరాను. ఇక అప్పటినుంచి అతడు మా కుటుంబానికి దగ్గర అయ్యాడు..పైగా సీమన్ మా అమ్మకు బాగా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. కానీ కొన్ని కారణాలవల్ల అతడు మధురై జైలులో శ్రీలంకలో యుద్ధం జరిగినప్పుడు రామేశ్వరంలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడడంతో సీమన్ ను అరెస్టు చేసి మదురై జైలులో ఉంచారు.
ఏడుసార్లు గర్భస్రావం.. 14 ఏళ్లుగా ఎదురుచూపు..
ఆ తర్వాత అక్కడే ఉండాలని కోరాను. దాంతో ఆయన మధురైలోనే ఉండిపోయారు. ఇక ఎవరైనా అతడిని కలవడానికి వస్తే.. నన్ను గదిలో ఉంచేవాడు. తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకోవాలనుకున్నాము. కానీ అతడు క్రిస్టియన్ కావడంతో తన మతాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. అతడు గుడిలోకి రావడానికి ఇష్టపడకపోవడంతో కారులోనే వివాహం చేసుకున్నాము. కానీ కొంత కాలానికి నాకు వేరే ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చింది. అప్పటికే ఆమెతో సీమన్ కి నిశ్చితార్థం అయ్యింది అని.. ఇక అప్పటినుంచి నాకు నరకం ఏంటో చూపించడం మొదలుపెట్టాడు. దాదాపు ఏడుసార్లు గర్భస్రావం చేయించుకోమని బలవంత పెట్టాడు. గత 14 ఏళ్లుగా నేను సీమన్ కోసం పోరాడుతున్నాను. ఆయన నాకు ఇప్పటికీ కావాలి అని.. కానీ అతడు మాత్రం నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయాడో అర్థం కావడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.