AP Politics: ఐఏఎస్ అధికారి గిరీషా పేరు మరోసారి పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా చిత్తూరులో ఆ సౌండ్ మరీ ఎక్కువ అవుతుందనే మాటలు గట్టిగానే వినపడుతున్నాయట. నిజమా అవునా అలా జరిగిందా అంటూ కింది స్థాయి కేడర్ నుండి పైనున్న కూటమినేతల వరకు ఇదే చర్చ నడుస్తోందట. అంతలా ఐఏఎస్ అధికారి గిరిషా పేరు మరోసారి చర్చకు రావడానికి కారణం ఏంటి? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి?
మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన ఐఏఎస్ అధికారి గిరీషా
ఐఏఎస్ అధికారి గిరీష పేరు మరోసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పొలిటికల్ సర్కిల్ లో మరింత చర్చకు దారితీస్తుందట. దానికి కారణం తిరుపతి లోక్సభా నియోజక వర్గం ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓటర్ కార్డులు సృష్టించి ఎన్నికలు జరిగాయని ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిన 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పిఎస్ గిరీషాకు ఉపశమనం లభించింది. ఈ వ్యవహారంలో గిరీషాకు ఎలాంటి పాత్ర లేదని ప్రభుత్వానికి విచారణాధికారి నివేదిక అందించారు. దీంతో ప్రభుత్వం ఆయనపై తదుపరి చర్యలు నిలిపివేసింది. ఇదే తిరుపతి సహా ఉమ్మడి జిల్లా కూటమి ఎమ్మెల్యేలు నేతల్లో హాట్ టాపిక్ గా మారడానికి కారణమైందట.
ఓటరు కార్డు అక్రమ డౌన్ లోడింగ్ ఆరోపణలో సస్పెన్షన్
తిరుపతి లోక్సభ నియోజక వర్గానికి 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేసిన వ్యవహారంలో సస్పెన్షన్‌కి గురైన నాటి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీషా పై ఈస సస్పెన్షన్ ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో తొలుత గిరీషా సస్పెన్షన్ కూడా ఐఏఎస్ వర్గాలు కలకలం రేపింది. ప్రత్యేకించి అప్పటి వైసీపీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేసింది. ఆయన తర్వాత వరుసగా పలువురు కింది స్థాయి అధికారులు ఉద్యోగులు సైతం సస్పెండ్ అయ్యారు. ఓవైపు శాఖపరమైన విచారణ మరోవైపు పోలీసు దర్యప్తు జరుగుతుండగానే గిరీషా పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఈస తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా జిల్లాలో చర్చనీయ అంశంగామారింది.
గత వైసీపీ ప్రభుత్వం అక్రమ ఓట్ల ఆరోపణలు
గతంలో పెద్ద ఎత్తున తిరుపతిలో ఓటర్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేసిన వైసపి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు కూటమినేతలు. అలాంటిది ఆ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న గిరీషా పై విచారణ పూర్తి కాకుండానే చర్యలు ఉపసంహరించుకోవడం తీవ్ర చర్చని అంశము మారింది. గిరీషా వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జిల్లా వ్యాప్తంగా ఆ టాపిక్ గా మారింది. కూటమి నేతలు అందరూ కూడా ఒక్కసారిగా గిరీషాకు ఉపశమనం అనగానే లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కూటమి నేతలు అయితే ఒక అడుగు ముందుకేసి అప్పట్లో దొంగ ఓట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున పోరాటం చేశమని ఇప్పుడు గిరీషాకు ఉపశమనం ఎలా ఇస్తారంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని తేగా పోస్ట్లు పెడుతున్నారు.
ప్రజలకు ఏం సమాధానం చెప్పాలంటున్న స్థానిక నేతలు
ఇన్నాళ్ళు దొంగ ఓట్ల వ్యవహారంలో తిరుపతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం పాత్ర ఉందని ఆరోపణలు గుప్పించిన తాము ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సీనియర్లను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే సీనియర్లు మాత్రం అందులో ఆయన తప్పు లేదని ఎలక్షన్ కమిషన్ కు సైతం గిరిషాది తప్పేనన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశమని చెప్పారంట. ఈ కేసు ఎక్కడికి పోలేదని ఈఆర్ఓ లాగిన్ ఐడిని దుర్వినియోగం చేశారని ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లను పెట్టుకొని అప్పటి డిప్యూటీ కమిషనర్ అధికారి చంద్ర మౌలీశ్వర్ రెడ్డి లాగిన్ పాస్వర్డ్ తీసుకొని 36,000 ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేయించారని వివరించారంట దీని వెనుక వైసీపీ నేతలే ఉన్నారని త్వరలోనే ఆ కేసు వేగవంతం అవుతుందని నచ్చ చెప్తున్నారట ఇప్పటికే కేసులో చాలా మంది అధికారులు సస్పెండ్ అయ్యారని మిగిలిన కేసు విచారణ వేగవంతం అవుతుందంటూ భరోసా ఇస్తున్నారట.
వైసీపీ నేతలతో భయందోళనలు
ఎరిష షా ఇష్యూ కూటమి నేతల్లో ఒక చర్చకు కారణమైతే వైసపీలు మరో రకమైన భయానికి కారణమైందట. ఆయనపై చర్యలను నిలిపి వేసిన నేపథ్యంలో తదుపరి అడుగులను కూటమి ప్రభుత్వం వేగంగా వేసే అవకాశం ఉంటుంది. ఉప ఎన్నికల సమయంలో జరిగినటువంటి తప్పులను గిరీష ఈస కి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదికలు అందించినట్లుగా సమాచారం రావడంతో వైసీపీ నేతల్లో అలజడి మొదలైందట. మొత్తానికి 2021లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫేక్ ఓటర్ల వ్యవహారం తాజాగా గిరీషాపై చర్యలు కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై కూటమి నేతలు ప్రభుత్వ పెద్దలపై పెదవి విరుస్తుంటే వైసీపీ నేతలు ఆందోళనలో ఉన్నారని చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుందట. మరి చూడాలి తాజా చర్యల తర్వాత ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్తుందో..
Story By Ajay Kumar, Bigtv