Intinti Ramayanam Today Episode September 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక అమ్మాయిని రమ్మని పిలుస్తుంది పల్లవి. ఆ అమ్మాయికి భారీగా డబ్బు ఆఫర్ చేసి అక్షయ్ అవని కలిసి లేరని మీ బాస్ కి తెలియజేయాలని చెప్తుంది. ఆ అమ్మాయి అలానే అని ఒప్పుకుంటుంది.. అయితే వాళ్ళందరూ అవన్నీ చేసిన వంటల గురించి మెచ్చుకుంటూ ఉంటారు. అవని ఏం చేసినా సరే చాలా బాగా ఉంటుంది. అందుకే వీళ్ళిద్దరి ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటారని అబద్ధాలు మీద అబద్ధాలు చెప్పేస్తారు. అక్షయ్ కూడా కావాలనే బలవంతంగా అవని తో కలిసి ఉన్న విషయాన్ని బయట పెట్టకుండా ఒప్పుకుంటాడు. చాముండేశ్వరి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అడగాలి అనుకుంటుంది. ఆ తర్వాత అక్షయ్ ఏదో ఫైల్ కోసం వస్తాడు. అది చూస్తున్న చాము అక్షయ్ అపద్దం చేస్తున్నాడా? లేదా అని తెలుసుకోవడం చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అక్షయ్ నాకెందుకు అబద్ధం చెప్పాడు అది ఆలోచిస్తూ ఉంటుంది చాముండేశ్వరి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అడగాలి అనుకుంటుంది. ఆ తర్వాత అక్షయ్ ఏదో ఫైల్ కోసం వస్తాడు. అది చూస్తున్న చాము అక్షయ్ అపద్దం చేస్తున్నాడా? లేదా అని తెలుసుకోవడం చేస్తుంది. అక్షయ్ మీ పెళ్లి ఎలా జరిగింది.. ప్రేమ, పెద్దలు చేసిన పెళ్లినా అని అడుగుతుంది. ఈవిడ ఏంటి నాకు ఎప్పుడు చుక్కలు చూపిస్తుంది అని అనుకుంటాడు. ప్రేమ పెళ్లి మేడమ్ అని చెప్తాడు. అవని బాగా చూసుకుంటుందా అని అంటాడు. బాగా చూసుకుంటుంది మేడమ్ అని అంటాడు. ఇక చాము వరుసగా ప్రశ్నలను అడిగి తెలుసుకుంటుంది. ఇష్టమైన కలర్, ఫుడ్ అన్నీ అడుగుతుంది. కానీ అక్షయ్ తెలియదు అనగానే షాక్ అవుతుంది.
అక్షయ్ ఎందుకు అబద్దం చెప్పాడు అని అనుమాన పడుతుంది. కచ్చితంగా ఈ విషయం గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక తర్వాత అవనిని అడగాలని అనుకుంటుంది.. మొత్తానికి పల్లవి ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తుంది. ఇంట్లో శ్రీకర్ తన పని తను చేసుకుంటూ ఉండగా ఫోన్ వస్తుంది అయితే కమలు తన కూడా ఫోన్ వచ్చినట్లు శ్రీకర్ కి కౌంటర్లు ఇస్తూ మాట్లాడతాడు. దానికి శ్రీకర్ నీతో మాట్లాడటం వేస్ట్ అని లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పల్లవి శ్రీయ ఇద్దరు కూడా నా మొగుడు గొప్ప నా మొగుడు గొప్ప అని మాట్లాడుకుంటూ ఉంటారు.
భరత్ ప్రణతి ఇద్దరూ బయటికి వెళ్ళడానికి రెడీ అయి వస్తారు అయితే మీరు ఆటోలో వెళ్తే రాజేంద్రప్రసాద్ గారి పిల్లలుగా మీకు అవమానం జరుగుతుంది.. కచ్చితంగా కారులోనే వెళ్లాలి అని మొండిపట్టు పడుతుంది. నాకు దారిలో ఒక చిన్న పని ఉంది నన్ను అక్కడ డ్రాప్ చేసేసి మీరు వెళ్లిపోవచ్చు అని పల్లవి అంటుంది. ఇక రాత్రి ఇంటికి వచ్చిన అక్షయ్ మా మేడం కి ఏదైనా చెప్పావా నువ్వు అని చిందులు వేసి కోపంతో రగిలిపోతాడు. మేడంకి చెప్పాల్సిన అవసరం నాకేంటి మధ్యాహ్నం బాగానే మాట్లాడారు కదా ఇప్పుడు ఏమైందో నాకు ఎలా తెలుస్తుంది అని అంటుంది.
ఇక పల్లవి భరత్ ప్రణతిలు కారులో వస్తుండగా ఎదురుగా అవని వస్తుంది. క్షణంలో ప్రమాదం తప్పుతుంది. ఈ కార్ ఎవరిది? ఇలాంటివి నీకు బాగా అలవాటయినట్టు ఉన్నాయి కదా అని భరత్ ని అడుగుతుంది. భరత్ ఇప్పుడు మా ఇంటి అల్లుడు తనకి మర్యాదలు చెయ్యాలి. ఎలా తప్పుగా అనుకున్న పర్లేదు అక్క అని అంటుంది. కారు లగ్జరీ లైఫ్ ఇలాంటివి అలవాటు పడితే మళ్లీ మానుకోవడం కష్టమవుతుంది అది గుర్తుపెట్టుకుని మసలుకో అని భరత్ కి వార్నింగ్ ఇస్తుంది..
Also Read : రోహిణికి షాకిచ్చిన ప్రభావతి.. మీనా, బాలు రొమాన్స్.. మనోజ్ కు కొత్త కష్టాలు..
అవని అక్షయ్ ల మధ్య దూరం ఇంకా అలానే ఉంది. రేపు వాళ్ళ పెళ్లి రోజు కదండీ మనము ఆరోజున గ్రాండ్ గా చేయాలి అని పార్వతి అంటుంది. అది నిజమే వాళ్ళ పెళ్లిరోజుని మనము గ్రాండ్ గా చేయాలి కానీ అక్షయ్ ఒప్పుకుంటాడా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. వాన్ని ఎలాగైనా ఒప్పించి తీరాల్సిందే ఎందుకంటే అవని మనకోసం ఎంతో చేస్తుంది మనం ఎంత చీ కొట్టినా మనందరం బాగుండాలని కోరుకుంది. నిన్న కూడా మన షష్టిపూర్తి బాగా జరగాలని కోరుకుందే తప్ప ఏమి చేయలేదు కదా అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..