E-Paper
Advertisement

Hero Vishal Case : దివాలా తీశారని ఒప్పుకుంటారా.. హీరో విశాల్ పై హైకోర్టు సీరియస్..

Hero Vishal Case : దివాలా తీశారని ఒప్పుకుంటారా.. హీరో విశాల్ పై హైకోర్టు సీరియస్..
Advertisement

Hero Vishal Case : తమిళ స్టార్ హీరో విశాల్ తరచుగా ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి వస్తుంటాడు. తన నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్లతో అతడికి చాలా గొడవలే ఉన్నాయి.. ఎన్ని వివాదాలు ఆయన ముందు ఉన్న కూడా విశాల్ మాత్రం పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఆ పెద్ద వివాదాల్లో ఒకటి లైకా ప్రొడక్షన్ దగ్గర భారీగా అప్పు చెయ్యడం. ఈ కేసు మద్రాస్ హైకోర్టు లో విచారణలో ఉంది. కొన్ని నెలల క్రితం ఈ కేసు గురించి బయటపడ్డది. ఇప్పుడు అతని కోర్టు షాకిచ్చే తీర్పు ఇచ్చింది. లైకా నిర్మాణ సంస్థకు కట్టాల్సిన డబ్బులను 30 శాతం వడ్డీతో కట్టాలని ఆదేశించింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం హీరో విష్ణు దివాలా తీసాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు అతనికి మరోషాక్ ఇచ్చింది. కాస్త వివరాల్లోకి వెళితే..

దివాళా తీసినట్టుగా ప్రకటించేందుకు సిద్ధమా?

హీరో విశాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. లైకా ప్రొడక్షన్ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో పాటుగా అతని సినిమాలు హక్కులను ఇవ్వకుండా అగ్రిమెంట్ వ్యతిరేకంగా వ్యవహారించారు. ఈ విషయంపై తీవ్రంగా మండిపడ్డ లైకా సంస్థ హీరో విశాల్ చేసిన దానికి కోర్టు ద్వారానే సమాధానం చెప్పించాలని కోర్టును ఆశ్రయించారు. కొన్ని వారాల క్రితం విచారణ మొదలైంది.. అయితే తాజాగా ఈ కేసు గురించి మద్రాస్ హైకోర్టు తుది తీర్పునిచ్చింది.. వీలైనంత త్వరగా లేక ప్రొడక్షన్స్ కి డబ్బులను చెల్లించాలని కోర్టు ఆదేశిస్తూ హీరో విశాలకు నోటీసులు పంపింది. అయితే విశాల్‌ తరపున హాజరైన న్యాయవాదులు తమ క్లైయింట్‌ ధనవంతుడు కాదని కోర్టుకు తెలపగా.. అయితే, విశాల్ దివాళా తీసినట్టుగా ప్రకటించేందుకు సిద్ధమా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. మరి విశాల్ దివాలా తీసినట్లు ప్రకటిస్తాడా? ఒకవేళ అదే గనక జరిగితే ఆయన నిర్మాణ సంస్థ మూసివేయాల్సి వస్తుంది. అంతే కాదు సినిమాలు తీసేందుకు డైరెక్టర్లు కూడా ఆసక్తి చూపిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా కూడా ఈ ఘటనపై విషయాలు స్పందిస్తే తప్ప అసలు వ్యవహారం ఇప్పుడే తేలదు.

Advertisement

Also Read : ప్రముఖ డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత..

విశాల్ పెళ్లి క్యాన్సిల్..? 

తమిళ స్టార్ హీరో విశాల్ గతంలో ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి పీటల వరకు వచ్చిన ఆ పెళ్లి అద్దాంతరంగా ఆగిపోయింది. అయితే అతని పెళ్లి ఎందుకు ఆగిందా అన్నది ఇప్పటికీ తెలియలేదు.. కానీ ఇప్పుడు మరోసారి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తమిళ హీరోయిన్ సాయి దన్షిక తో గత కొన్ని నెలలు ప్రేమాయణం నడిపిన విశాల్ ఇటీవలే ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. సింపుల్గా చేసుకున్న ఈ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు విశాల్ వివాదంలో చిక్కుకోవడంతో ఈ పెళ్లి ఆగిపోతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి..

Advertisement

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×