Bhuvanagiri Crime: పని పాటా లేని కొందరు వ్యక్తులు సులువుగా డబ్బు సంపాదించాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో చేయని తప్పులు అన్నీఇన్నీ కావు. తప్పించుకోలేక అడ్డంగా బుక్కైన సందర్భాలు కోకొల్లలు. తాజాగా అలాంటి పని చేశాడు ఓ వ్యక్తి. నిత్య పెళ్లికొడుకు మారి చివరకు కటకటాలపాలయ్యాడు. అసలే మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
వీడు మామూలోడు కాదు, నిత్య పెళ్లి కొడుకు
కనిపిస్తున్న వ్యక్తి పేరు సురేంద్ర.. మహా మాటకారి కూడా. ఎలాంటివారినైనా తన మాటలతో మాయ చేయగలదు. వారిని తన బుట్టలో వేసుకునే టాలెంట్ ఉన్న వ్యక్తి. దీన్ని మంచికి ఉపయోగించే బాగుండేది. పెళ్లిళ్ల పేరిట మహిళలను మోసం ఇతగాడి హాబీ. పాపం పండితే ఏం జరుగుతుంది. సురేంద్ర విషయంలో సరిగ్గా అదే జరిగింది.
జల్సాలకు అలవాటు పడిన సురేంద్ర, డబ్బుల కోసం కొత్త మార్గాన్ని అన్వేషించాడు. పెళ్లి చేసుకొని మహిళలను మోసం చేయడం అలవాటుగా పెట్టుకున్నాడు. ఏపీలోని కడప టౌన్‌కి చెందిన సురేంద్ర.. మాయమాటలు చెబుతూ మహిళలను మోసం చేసేవాడు. తనకు మైనింగ్, పెట్రోల్ బంక్, కన్సల్టెన్సీలు ఉన్నాయని చెప్పి వివాహం చేసుకున్నాడు.
వాడి మాటల్లో పడితే సర్వం నాశనం
సరిగ్గా 2017లో ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. సరిగ్గా మూడేళ్లు తిరిగేసరికి ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇదే క్రమంలో ఐదేళ్ల కిందట భువనగిరికి చెందిన ఓ మహిళను క్రైస్తవ మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తనకు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి నమ్మించేవాడు. పెట్రోల్ బంక్, కన్సల్టెన్సీ.. ఇలా ఒకటేంటి, కొత్త కొత్త వ్యాపారాల పేర్లు చెప్పేవాడు.
కట్నంగా ఆ మహిళ నుంచి రూ.15 లక్షలు, 30 తులాల బంగారం తీసుకున్నాడు. ఇంతవరకు బాగానే సాగింది. వివాహం తర్వాత సొంతూరికి తీసుకెళ్లకుండా భార్యని వేధించేవాడు. ఇంటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని తరచూ వేధించేవాడు. సురేంద్ర టార్చర్‌తో విసిగిపోయిన ఆ మహిళ, భువనగిరి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు, లోతుగా దర్యాప్తు చేశారు.
ALSO READ:ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడిన కారు
దీంతో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కడపలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. అక్కడ కూడా మరో మహిళను వివాహం చేసుకొని కాపురం పెట్టినట్లు గుర్తించి షాకయ్యారు. ఇతగాన్ని అరెస్టు చేసిన పోలీసులు, న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్‌కు విధించింది. ఈ విషయాలను పోలీసులు స్వయంగా వెల్లడించారు.
నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్..
మహిళల దగ్గర డబ్బు, ఆభరణాలు తీసుకుని మోసం చేసి పారిపోయిన సురేంద్రను అరెస్టు చేసిన భువనగిరి పోలీసులు
2021లో క్రిస్టియన్ మాట్రిమోని ద్వారా యువతితో పరిచయం చేసుకున్న సురేంద్ర
తప్పుడు ఉద్యోగ, వ్యాపార వివరాలు చెప్పి నమ్మించి రూ.15 లక్షల నగదు, 30 తులాల… pic.twitter.com/bIUfZ3GwM6
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2025