Anjali Murder Case: ప్రస్తుత సమాజం దారుణంగా తయారైంది. మానవత్వం మంట కలిసిపోయింది. అన్నా.. తమ్ముడు.. చెల్లి.. అక్క.. భర్త.. తల్లి ఎవరైనా సరే.. తమకు అడ్డువస్తే చంపడానికి సైతం వెనుకాడట్లేదు. మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా మారాయి. దేశంలో ఎక్కడో ఓ చోట నిత్యం దారుణ హత్యలు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు వచ్చినా.. వీటికి మాత్రం పులిస్టాప్ పడడం లేదు. మొన్నటికి మొన్న మేఘాలయ హనీమూన్ మర్డర్, నిన్న గద్వాలలో భర్త దారుణ హత్య ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తాజాగా చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ గాయిని, ఫోక్ సింగర్ అంజలి తన సొంత కూతురు చేతిలో దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే.
హైదరాబాద్ జీడిమెట్లలో నివాసం ఉంటున్న అంజలి తన పెద్ద కూతురు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచియమైన ఓ యువకుడితో మాట్లాడుతుందని మందలించింది. పదో తరగతి చదువుతున్న ఆ మైనర్ బాలి లవర్ కోసం తల్లిని అతి కిరాతకంగా చంపింది. ప్రేమ విషయంలో తల్లి అంజలి మందలించిందన్న కోపంతో ఆమెను గొంతు నులిమి, తలపై కొట్టి దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ప్రియుడితో పాటు అతడి సోదరుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
కన్నతల్లిని కూతురు కర్కశంగా చంపేసిన కేసు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను.. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పెద్ద కూతురే తల్లి హత్యకు ప్లాన్ చేసినట్లుగా అంగీకరించింది. నిందితురాలు చెబుతేనే హత్య చేశాను అని ప్రియుడు నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు. మర్డర్‌కి ముందుగానే ఇద్దరి కలిసి ప్లాన్ చేసినట్లుగా నేరాన్ని అంగీకరించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈరోజు కోర్టులో వీరిద్దరిని హాజరుపరిచే అవకాశం ఉంది.
అంజలిని చంపడం కరెక్టే: నిందితుడి తల్లి
అయితే అంజలి హత్య కేసుపై నిందితుడి శివ తల్లి సంతోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలిక తల్లి అంజలిని చంపడం కరెక్టే.. ఈ రోజు కాకపోతే రేపు వెళ్లి నా కొడుకులను బయటకు తీసుకొస్తాను. ఆ బాలిక మా అబ్బాయి ప్రేమించుకున్న విషయం వాస్తవమే. ఇటీవల ఆ బాలిక మా ఇంట్లో రెండు రోజులు ఉంది. ఈ విషయం అంజలికి నచ్చలేదు. మాపై పీఎస్‌లో కేసులు పెట్టింది. అందుకే ఆమె అంటే మాకు నచ్చదు’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ALSO READ: Allu Arvind Mother Health: బిగ్ బ్రేకింగ్… అల్లు అరవింద్ తల్లికి తీవ్ర అస్వస్థత!
తన అక్క చేతిలోనే తల్లి అంజలి హత్యకు గురవడంతో.. రెండో కూతురు కన్నీరుమున్నీరవుతోంది. అమ్మను చంపిన అక్కతో పాటు ఆమె ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్‌ని ఉరి తీయాలంటోంది. శివ ఎలా చెబితే అక్క అలా చేసిందని.. ఆమెకు కొంచెం కూడా కనికరం లేదని చెప్పింది. తల్లి కొన ఊపిరితో ఉండటంతో.. శివకు ఫోన్ చేసి ఇంకా బతికే ఉందని చెప్పిందని.. వాళ్లు వచ్చి మళ్లీ తన తల్లి తలపై సుత్తితో కొట్టారని చెబుతోంది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే.. వాళ్లు వెళ్లిపోయారని, తల్లి చనిపోయిందనే బాధ.. తన అక్కకు ఏమాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.