Vijay Thalapathi ‘Jana Nayagan’:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathi) చివరి సినిమాగా వస్తున్న చిత్రం ‘జన నాయగన్’. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde)హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి లో విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ తమిళ నాటే కాదు సౌత్ ఇండస్ట్రీ మొత్తం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టిన కేవీఎన్ ప్రొడక్షన్స్(KVN Productions) ఈ మధ్యకాలంలో బిజినెస్ పరంగా బాగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేకించి కన్నడలో డిస్ట్రిబ్యూషన్ బేస్ నుంచి నేడు నిర్మాణ సంస్థగా నిలిచిన ఈ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు నిర్మాణ రంగంలో టాప్ ప్లేస్ కోసం చాలా బలంగా ప్రయత్నం చేస్తోంది.
అరుదైన రికార్డ్.. ఒకే పేమెంట్ లో రూ.275 కోట్లు..
అందులో భాగంగానే స్టార్ హీరోలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది..ఈ క్రమంలోనే కన్నడ హీరో యష్ (Yash ) తో ‘టాక్సిక్’ సినిమా చేస్తున్న ఈ సంస్థ.. మరొకవైపు లోకేష్ కనగరాజు(Lokesh kanagaraj)తో డీల్, ప్రభాస్(Prabhas ), రామ్ చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR)లాంటి స్టార్ హీరోలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు విజయ్ సినిమా కోసం విజయ్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఏ సినీ హీరోకి లభించని భారీ మొత్తం విజయ్ కి దక్కిందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విజయ్ కి లభించిన ఆ రెమ్యూనరేషన్ ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ), రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వెనుకడుగు వేయాల్సిందే. అసలు విషయంలోకి వెళితే.. జన నాయగన్ మూవీ కోసం విజయ్ కి KVN ప్రొడక్షన్స్ వారు ఏకంగా రూ.275 కోట్ల రెమ్యూనరేషన్ రూపంలో డైరెక్ట్ గా చెల్లించినట్లు సమాచారం. ఇందులో ఎలాంటి షేర్ కట్ లేకుండా పూర్తిగా ఫుల్ పేమెంట్ చేసేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ నమ్మకమే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ కి కారణం..
వాస్తవానికి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎక్కువగా ప్రాఫిట్, షేరింగ్ లేదా పార్సల్ రెమ్యునరేషన్ పద్ధతిలోనే రెమ్యూనరేషన్ తీసుకునే వాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం కె.వి.ఎన్ వర్గాలు ముందస్తుగా అన్ని అమౌంట్స్ చెల్లించడం వారికి మార్కెట్ మీద ఉన్న నమ్మకాన్ని అలాగే విజయ్ సినిమా మీద ఉన్న బిజినెస్ బలాన్ని చాటుతోందని చెప్పవచ్చు.దీనికి తోడు ఈ సినిమాకి హెచ్ వినోత్ (H.Vinoth) దర్శకత్వం, అనిరుద్ (Anirudh Ravichandran) మ్యూజిక్, పైగా విజయ్ చివరి సినిమా అనే ఒక మాట అన్నీ కూడా బాగా కలిసి రావడంతో ముందు నుంచి సినిమాకి భారీ స్థాయిలో ఏర్పడింది. పైగా బడ్జెట్, మార్కెటింగ్ కాస్ట్, డిజిటల్ రైట్స్ లెక్కలు కాకుండా ఒక్క విజయ్ కి మాత్రమే రూ.275 కోట్లు పారితోషకం ఇవ్వడం అంటే ఈ నిర్మాణ సంస్థ సత్తా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ నిర్మాత సంస్థలకు గట్టి పోటీ ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్..
ఒకరకంగా చెప్పాలి అంటే ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థలుగా చలామణి అవుతున్న మైత్రి మూవీస్ , హోంబలే నిర్మాణ సంస్థలకు ఈ కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పోటీగా నిలుస్తోంది అని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఒక్క సినిమా కోసమే కాకుండా భవిష్యత్తులో తమతో చేతులు కలిపే స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లకి కూడా ఇది ఒక సేఫ్ బెల్ట్ అనే మెసేజ్ ఇస్తోంది.అంతేకాదు కేవీఎన్ మాత్రమే ఎవరు ఇవ్వలేని రెమ్యూనరేషన్ కూడా ఇస్తుందని ఒక స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నట్లు అర్థమవుతోంది. ఇకపోతే వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ALSO READ:Hero Sriram Drugs Case: డ్రగ్స్ గుట్టు బయటపెట్టిన హీరో శ్రీరామ్!