BigTV English

Thammudu Day1 Collections: ‘తమ్ముడు’ తో నితిన్ హిట్ కొట్టాడా?.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..?

Thammudu Day1 Collections: ‘తమ్ముడు’ తో నితిన్ హిట్ కొట్టాడా?.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..?

Thammudu Day1 Collections: టాలీవుడ్ హీరో నితిన్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటగా వచ్చిన రాబిన్ హిట్ మూవీ యావరేజ్ టాక్ ను కూడా అందుకోలేదు.. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ టైటిల్ తమ్ముడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్లో మూవీ వచ్చింది.పవన్ కళ్యాణ్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలోకి రిలీజ్ అయింది. కన్నడ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ, మలయాళ హీరోయిన్ స్వస్తిక, తెలుగు నటీనటులు లయ, హరితేజ, బాలీవుడ్ నటుడు సౌరబ్ సచ్‌దేవ, టెంపర్ వంశీ చమ్మక్ చంద్ర తదితరులు నటించారు.. సినిమా మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. కానీ థియేటర్లలోకి వచ్చాక ఆ టాక్ ను అందుకోలేదని టాక్ వినిపిస్తుంది.. తమ్ముడు మొదటి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లో ఒకసారి తెలుసుకుందాం..


‘తమ్ముడు’ ఫస్ట్ డే కలెక్షన్స్..

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వస్తిక నటించిన చిత్రం తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. హైదరాబాద్‌లో 381 షోలు, బెంగళూరులో 262 షోలు, విజయవాడలో 82, విశాఖలో 114 షోలు ప్రదర్శితమయ్యాయి. తమ్ముడు సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేసిన ఈ మూవీ మొదటి షోతోనే పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ.50 లక్షలు రాబట్టవచ్చని చెబుతున్నారు.. అటు ఓవర్సీస్ లో కలిపి కూడా దిల్ రాజు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. అందుకే అక్కడ కూడా కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీకి మొదటి రోజు దాదాపు 3కోట్లకు పైగా వసూల్ చేసిందని అంచనా వేస్తున్నారు. మరి ఎన్ని కోట్లు రాబట్టిందో తెలియాలంటే టీమ్ అనౌన్స్ చెయ్యాల్సి ఉంది.


ఈ మూవీ బిజినెస్ & టార్గెట్ విషయానికొస్తే..

నితిన్ సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన డిజాస్టర్ అవుతున్నాయి. ఇప్పుడొచ్చిన తమ్ముడు కు నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలు కలిపి తమ్ముడు చిత్రానికి 75 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. ఒకవైపు నితిన్ మార్కెట్ డల్ అవుతున్న సరే కొత్త సినిమాలకు బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి.

Also Read:హీరోలకు శాపంగా పవన్ కళ్యాణ్.. మరో హీరోకు బిగ్ షాక్..!

ఈ మూవీ బిజినెస్ విషయానికొస్తే..

తమ్ముడు బిజినెస్ విషయానికొస్తే.. నైజాంలో 8.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలు, ఏపీలోని ఇతర జిల్లాల హక్కులు 8.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మొత్తంగా ఆంధ్రా, నైజాంలలో తమ్ముడు సినిమాకు 20 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా హక్కులు 50 లక్షలు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. మొత్తంగా తమ్ముడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది.. మొత్తంగా చూసుకుంటే 50 రూపాయల టార్గెట్ తో మూవీ థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నా రెండో రోజు కలెక్షన్స్ పెరిగే అవుతుందని సమాచారం.. చూడాలి ఏ రేంజులో వసూల్ చేస్తుందో..

Related News

Suresh Gopi: మళ్లీ సినిమాలు చేస్తానంటున్న సురేష్.. కేంద్ర పదవికి రాజీనామా?

Sankranthiki vastunnam Remake: బాలీవుడ్ లోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ..హీరో ఆయనే..?

Senior heroines: సీనియర్ హీరోయిన్స్ కి కలిసిరాని రీఎంట్రీ.. మరి కామ్నా సంగతేంటి?

Siddu Jonnalagadda : తెలుసు కదా ట్రైలర్ కు ఎలివేషన్స్. నాగ వంశీ, సుమ ఆసక్తికర ట్విట్స్

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Big Stories

×