E-Paper
Advertisement

వ‌న్డేల్లోనూ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగితే, 50 ఓవ‌ర్ల‌లో 600 కొట్ట‌డం ప‌క్కా

వ‌న్డేల్లోనూ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగితే, 50 ఓవ‌ర్ల‌లో 600 కొట్ట‌డం ప‌క్కా
Advertisement

Younis Khan On Abhishek Sharma Odi:  టీమిండియా టీ20 స్పెషలిస్ట్ అభిషేక్ శర్మ భయంకరమైన బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ భారీ సిక్సర్లు, బౌండరీలు కొడుతూ రచ్చ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే టీ20లలో నెంబర్ వన్ ఆటగాడిగా కూడా నిలిచాడు. దీంతో అభిషేక్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మొన్నటి వరకు ఫ్లాట్ మైదానాలపైన ఆడతాడని చాలా మంది విమర్శలు చేసిన వాళ్లు కూడా న్యూజిలాండ్ గడ్డపై అభిషేక్ శర్మ ఆటను మెచ్చుకుంటూ కొనియాడుతున్నారు. అయితే అలాంటి అభిషేక్ శర్మపై పాకిస్తాన్ ఒకప్పటి డేంజర్ ఆటగాడు యునిస్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లోకి కూడా అభిషేక్ శర్మను తీసుకురావాలని బీసీసీఐకి సూచనలు చేశాడు. అతడు వన్డేలు ఆడితే 50 ఓవర్లను 600ల ప‌రుగులు కొట్టడం కూడా సులభం అవుతుందని అంచనాలు వేశాడు. ఓపెన‌ర్లుగా అతడు బరిలోకి దిగి.. 10 ఓవర్లలోపే 150 పరుగులు సులభంగా రాబడతాడని చెప్పుకొచ్చారు.

ఆ రాక్ష‌సుడు ఆడితే, బౌల‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోతాయ్

అభిషేక్ శర్మను వన్డేల్లోకి తీసుకురావాలని ఇటీవల యువరాజ్ సింగ్ కొత్త ప్రతిపాదన తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. దానికి మద్దతుగా మాజీ క్రికెటర్లు నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే యువరాజు సింగ్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ యూనిస్ ఖాన్ కూడా స్పందించాడు. అభిషేక్ శర్మ పెద్ద రాక్షసుడు అని… అతని చూస్తేనే బౌలర్లు వణికి పోయే పరిస్థితి ఉందని తెలిపాడు. టీ20 క్రికెట్ లో అతని ప్రతాపం ఏంటో అందరికీ తెలిసిందని వివరించాడు. భయంకరమైన ఆటగాళ్ల ప్రభావం కేవలం టీ20 లలో మాత్రమే ఆగిపోకూడదని కోరాడు. వెంటనే అతన్ని వన్డే క్రికెట్ లోకి తీసుకురావాలని డిమాండ్ చేశాడు. వన్డేలు కనుమరుగు అవుతున్నాయని చాలా మంది అంటున్నారు.. కానీ అభిషేక్ శర్మ లాంటి వాళ్లు వ‌న్డేల‌లోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అంచనా వేశాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

మంచినీళ్లు తాగినంత ఈజీగా అభిషేక్ శర్మ సిక్సర్లు కొడతాడని.. దీని వల్ల వన్డేలా వ్యూయర్షిప్ కూడా భారీగా పెరుగుతుందని తెలిపాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్య‌వంశీ, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురిని కూడా వన్డేలోకి తీసుకువస్తే.. ప్రత్యర్థి బౌలర్లు ప్యాంట్లు తడుపుకుంటారని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఇటు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేలా బీసీసీఐ చర్చలకు రావాలని డిమాండ్ చేశాడు. అభిషేక్ శర్మలాంటి భయంకరమైన క్రికెటర్లు పాకిస్తాన్ లో కూడా ఆడాలని తనకు ఆశగా ఉందని చెప్పుకొచ్చాడు. ద్వైపాక్షిక సిరీస్ లు జరిగితేనే ఇది సాధ్యపడుతుందని.. ఆ దిశగా బీసీసీఐ అడుగులు వేయాలని కోరాడు. దీనివల్ల రెండు బోర్డులకు లాభం జరుగుతుందని తెలిపాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

విరాట్ కోహ్లీకి పొగ‌రెక్కువ…అయినా గంభీర్ తొక్కుకుంటూ పోతున్నాడు!

దక్షిణాఫ్రికా పిచ్‌లను గిల్ తట్టుకోలేడు… 2027 వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాఫ్ అవుతాడు!

ఐపీఎల్ 2027లోకి బంగ్లాదేశ్ ప్లేయర్లు..తల పట్టుకుంటున్న పాకిస్తాన్

ఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

టీమిండియాలో ముస్లింల‌కు అన్యాయం..అందుకే మ‌హ్మ‌ద్ ష‌మీ రిటైర్మెంట్ ?

విరాట్ కోహ్లీకి బిల్డ‌ప్ ఎక్కువ‌..వాడిని ఓ బ‌చ్చాగాడిలా ట్రీట్ చేసి అవ‌మానించా!

ఐపీఎల్ వేలంలో ఆర్య‌వీర్ సెహ్వాగ్ రూ.10 కోట్లు ప‌ల‌క‌డం ప‌క్కా

Big Stories

Advertisement
×