E-Paper
Advertisement

సురేష్ రైనాను CSK వాడుకుని వ‌దిలేసింది.. అంబ‌టి రాయుడు సంచ‌ల‌నం

సురేష్ రైనాను CSK వాడుకుని వ‌దిలేసింది.. అంబ‌టి రాయుడు సంచ‌ల‌నం
Advertisement

Ambati Rayudu about Suresh Raina and CSK:  చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) యాజమాన్యంపై మాజీ క్రికెర్ అంబటి రాయుడు (Ambati Rayudu ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత కొన్ని సీజన్లుగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో వరుసగా విఫలమౌతూ వస్తోందని బాంబు పేల్చాడు. ముఖ్యంగా సురేష్ రైనా (Suresh Rain ) విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని ఫైర్ అయ్యాడు. అతన్ని వాడుకొని వదిలేసారని మండిపడ్డాడు.

సురేష్ రైనాను CSK వాడుకుని వ‌దిలేసింది.. అంబ‌టి  సంచ‌ల‌నం

కుటుంబ సమస్యల నేపథ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ జట్టును వీడిన సురేష్ రైనా… రీ-ఎంట్రీలో భాగంగా మళ్లీ అదే జట్టుకు ఆడాలని ఎంతో ట్రై చేశాడని… కానీ సీఎస్కే యాజమాన్యం రిజెక్ట్ చేసిందని ఫైర్ అయ్యాడు. ఇక లేటెస్ట్ గా చెన్నై సూపర్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్ లో భాగం అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు సురేష్ రైనా చేస్తే… యాజమాన్యం లైట్ తీసుకుందని ఆగ్రహించాడు. దీంతో సురేష్ రైనాకు తీవ్ర అన్యాయం జరిగిందని అంబటి రాయుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Advertisement

విదేశీ క్రికెటర్లను అనవసరంగా మేపుతున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం.. మిస్టర్ ఐపిఎల్ గా పేరుగాంచిన సురేష్ రైనాను మ పట్టించుకోవడంలేదని సీరియస్ అయ్యాడు. స్వదేశీ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వకుండా… విదేశీ క్రికెటర్లకు ఛాన్సులు ఇస్తే పెద్దగా టీమిండియాకు ప్రయోజనం ఉండదని పేర్కొన్నాడు. ఐపీఎల్ టోర్నమెంట్లో ఏ ఫ్రాంచైజీ అయిన భారత దేశవాళి క్రికెటర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ముందుకు సాగాలని కోరాడు.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

ముంబై ప్లేయర్లను తెగ మెచ్చుకుంటారు

Advertisement

దేశ వ్యాప్తంగా ఎంతో మంది టాలెంట్ క్రికెటర్లు ఉన్నప్పటికీ… ముంబై నుంచి వచ్చిన వాళ్లకు టీమిండియాలో ఎక్కువగా అవకాశాలు వస్తాయని అంబటి రాయుడు సంచలన ఆరోపణలు చేశాడు. వాళ్లు సరిగ్గా ఆడకపోయినా… గ్రేట్ క్రికెటర్లు అంటూ పిలుస్తారని తెలిపాడు. ఓ ముంబై క్రికెటర్ షాట్ ఆడి ఔట్ అయితే… అతని మెచ్చుకుంటారు తప్ప తిట్టారని తెలిపాడు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా క్రికెటర్ అలాంటి బంతికే వికెట్ కోల్పోతే.. క్రికెట్ ఆడరాదు అంటూ కామెంట్రీ చేస్తూ ఉంటారని ఫైర్ అయ్యాడు.

ఇది ఇలా ఉండగా అంబడి తిరుపతి రాయుడు టీమిడియా తరఫున ఎన్నో మ్యాచులు ఆడడమే కాకుండా ఐపిఎల్ లో పలు జ‌ట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల‌కు కూడా ఆడిన అనుభవం అతడికి ఉంది. ఏపీలోని గుంటూరులో జన్మించిన అంబటి రాయుడు… అండర్ 19 టీమిండియా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి… ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు. కొన్ని వివాదాల కారణంగా 2019లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రస్తుతం వ్యాపారాల్లో దూసుకు వెళ్తున్నాడు.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

Related News

టీమిండియాలాగా చీటింగ్ చేయ‌లేదు.. రూల్స్ ప్రకార‌మే అంధుల ఆసియా క‌ప్ గెలిచాం

పొర‌పాటున ధోని జెర్సీపై ఆటోగ్రాఫ్…డ్రెస్సింగ్ రూంలో కూర్చొని గంభీర్ ర‌చ్చ‌

SRH ఓన‌ర్ కావ్య పాప పెళ్లి…వాళ్లంద‌రికీ ఖ‌రీదైన‌ గోల్డ్ రింగులు!

10 కిలోలు త‌గ్గితేనే టీమిండియాలోకి తీసుకుంటామ‌ని గంభీర్ టార్చ‌ర్ పెట్టాడు!

ఇండియాను ఎగ‌తాళి చేస్తూ పాకిస్తాన్ అంధుల క్రికెట‌ర్ల సెల‌బ్రేష‌న్స్‌..హరీస్ రౌఫ్ ను మించిపోయేలా

కంటిచూపు లేకపోయినా ఫైనల్‌లో టీమిండియాను ఓడించారు.. ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాల్సిందే

బలహీన నేపాల్‌ను ఓడించి సంబర పడిపోకండి.. నవంబర్ 22న నరకం చూపిస్తాం

Big Stories

Advertisement
×