Jagan: బీజేపీతో జగన్ చేస్తున్న అంతర్గత చర్చలు ఎంతవరకు వచ్చాయి? అధినేతతో మాట్లాడటానికి బీజేపీ ససేమిరా అంటోందా? వైసీపీని దూరం పెట్టాలని డిసైడ్ అయ్యందా? ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిస్తున్నాయి. అసలేం జరిగింది?
ఏపీలో అధికారం పోయిన తర్వాత బీజేపీకి దగ్గరయ్యేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు మాజీ సీఎం జగన్. బెంగుళూరు వేదికగా అక్కడి నేతల ద్వారా తనవంతు ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో జగన్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. దాని ద్వారా బల ప్రదర్శన చేశారు.
జగన్‌కు మద్దతుగా ఉండే ఏపీలో కొందరు బీజేపీ నేతలు హైకమాండ్‌కి దృష్టికి పంపించినట్టు సమాచారం. ఎన్నికల్లో ఓడినా, మాజీ సీఎంకు ప్రజల్లో ఆదరణ ఉందన్నది అందులోని సారాంశం. ఈ విషయం లో కమలనాధుల నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చేయో తెలీదు. మంత్రి సత్యకుమార్ ఎదురుదాడి చూసి షాకయ్యారు వైసీపీ నేతలు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలకు కౌంటరిస్తున్నారు టీడీపీ-జనసేన నేతలు. కానీ బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్లు పడలేదు. హైకమాండ్ సంకేతాలు ఏమో తెలీదుగానీ మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మద్య కుంభకోణం సూత్రధారి జగన్ అరెస్టు కానున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ALSO READ: కాఫీ గిన్నెకు భయపడి ఇద్దరు బాలికలు సూసైడ్, ఏం జరిగిందంటే
అంతేకాదు కూటమి ఏడాది పాలనపై ‘సాక్షి’ చర్చకు సిద్ధమేనంటూ ఎటాకింగ్ మొదలుపెట్టారు. ఉన్నట్లుండి మంత్రి సత్యకుమార్ కామెంట్స్‌పై వైసీపీలో అప్పుడే చర్చ మొదలైంది. మంత్రి మాటల వెనుక బీజేపీ హైకమాండ్ ఉండవచ్చని అంటున్నారు. అందువల్లే నేరుగా లిక్కర్ స్కామ్‌లో జగన్ అరెస్టు కావడం ఖాయమని ఓపెన్‌గా చెప్పారని అంటున్నారు.
మంత్రి సత్యకుమార్ గురించి చెప్పనక్కర్లేదు. హోంమంత్రి అమిత్ షాకు సత్యకుమార్ నమ్మినబంటుగా చెబుతారు ఆ పార్టీ నేతలు. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆఫ్ ద రికార్డులో చెబుతుంటారు. అందువల్లే మొన్నటి ఎన్నికల్లో ఆయన ధర్మవరం నుంచి గెలవడం, ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి కావడం చకచకా జరిగిపోయిందని అంటున్నారు.
దీనికితోడు లిక్కర్ కేసు వ్యవహారం వైసీపీని కకావికలం చేసింది. దాని మూలాలు ఏకంగా అధినేత మెడకు చుట్టుకున్నాయి. జరిగిన.. జరుగుతున్న పరిణామాలను గమనించిన బీజేపీ పెద్దలు మంత్రి సత్యకుమార్ ద్వారా ఎదురుదాడికి దిగేలా చేశాయని అనుకుంటున్నారు వైసీపీ నేతలు. ఈ లెక్కన వైసీపీకి కమలం నుంచి కష్టాలు తప్పవని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.