InD vs eng 3rd test: భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ లో గెలిచేందుకు ఇంగ్లాండ్ కుయుక్తులను ప్రదర్శిస్తోంది. ఐదవ రోజు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచేందుకు మరో 135 పరుగులు మాత్రమే అవసరం. ఇంగ్లాండ్ జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య చేదనలో భారత జట్టు నాలుగవ రోజు ఆట ముగిస్తే సమయానికి నాలుగు వికెట్లను కోల్పోయి 58 పరుగులు చేసింది. టీమిండియా ప్రధాన బ్యాటర్లు యశస్వి జైష్వాల్, గిల్, కరుణ్ నాయర్ వికెట్లను భారత్ చేజార్చుకుంది. ఇక నైట్ వాచ్ మెన్ గా వచ్చిన ఆకాష్ దీప్ చివరి ఓవర్ లో పెవిలియన్ చేరాడు.
Also Read: IND VS ENG: టీమిండియా కొంపముంచుతున్న 24 పరుగులు… ఇంగ్లాండ్ ను తట్టుకొని ఇవాళ నిలుస్తారా !
ఇంగ్లాండ్ మైండ్ గేమ్:
భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సమయంలో ఇంగ్లాండ్ మైండ్ గేమ్ ప్రారంభించింది. మొదటి రెండు టెస్ట్ లలో సెంచరీలతో అదరగొట్టిన కెప్టెన్ గిల్.. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే 600కు పైగా పరుగులు చేశాడు. అలాగే రెండోవ టెస్ట్ గెలవడంలోనూ కీలకపాత్ర పోషించాడు. అలాంటి బ్యాటర్ మూడవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగినప్పటి నుండి.. ఇంగ్లాండ్ ఆటగాళ్లు తమ నోటికి పని చెప్పారు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరింతగా రెచ్చిపోయి.. “ఈ సిరీస్ తో అయిపోయావు. ఇప్పటికే 600కు పైగా పరుగులు చేశావు. ఇవి నీకు సరిపోతాయి” అంటూ స్లెడ్జింగ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కార్స్ బౌలింగ్ లో గిల్ ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ చేరాడు.
ఇంగ్లాండ్ జట్టే గెలుస్తుందా..?
ఐదవ రోజు భారత జట్టు మరో 135 పరుగులు చేస్తే గెలుపొందుతుంది. ఈ సమయంలో మరో మైండ్ గేమ్ ప్రారంభించింది ఇంగ్లాండ్. జూలై 14 {నేడు} ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కి అదృష్టమైన తేదీ అని.. ఈ కారణంగా ఇంగ్లాండ్ జట్టు నేడు కచ్చితంగా గెలుస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 2019 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కూడా జూలై 14 వ తేదీనే జరిగింది. ఆ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టుపై బెన్ స్టోక్స్ 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే ఆ ఫైనల్ మ్యాచ్ టై కావడంతో.. సూపర్ ఓవర్ నడిపించడంలో కూడా కీలకపాత్ర పోషించాడు. దీంతో ఆ ఫైనల్ మ్యాచ్ లో స్టోక్స్ ప్రదర్శనకి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు లభించింది.
Also Read: MI New York: ముంబైని ఎవ్వడు ఆపలేడు.. 13వ సారి టైటిల్ సొంతం…
ఇక జూలై రెండవ తేదీన భారత్ తో ప్రారంభమైన ఐదు టెస్టుల సిరీస్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు స్టోక్స్. ఈ క్రమంలో జూలై 14 వ తేదీన స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు గెలుపొందుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నిజానికి స్టోక్స్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను అదరగొడుతుంటాడు. డిఫెన్స్ తో పాటు అటాకింగ్ పరంగాను అతడికి డోకా లేదు. మంచి టెక్నిక్ తో బౌలర్లను ఓ ఆట ఆడుకుంటాడు. అతడి వికెట్ తీయడం అంత ఈజీ కాదు. అలాగే బంతితోనూ అద్భుతాలు సృష్టిస్తాడు. కానీ ఈ జూలై 14 సెంటిమెంట్ ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో.. ఈ సెంటిమెంట్ ఏమాత్రం వర్కౌట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు భారత క్రీడాభిమానులు.